Big Boss 6 telugu:శ్రీహాన్- ఇనయా మధ్య రహస్యాన్ని బయటపెట్టిన హైపర్ ఆది, ఒక్కొక్కరికి ఇచ్చిపడేశాడుగా...

Published : Oct 23, 2022, 10:01 PM ISTUpdated : Oct 23, 2022, 10:06 PM IST
Big Boss 6 telugu:శ్రీహాన్- ఇనయా మధ్య రహస్యాన్ని బయటపెట్టిన హైపర్ ఆది, ఒక్కొక్కరికి ఇచ్చిపడేశాడుగా...

సారాంశం

బిగ్ బాస్ తెలుగు  సీజన్ 6  చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.  ఈ వీకెండ్ దివాళి ఎపిసోడ్ తో సందడి సందడిగ మారింది బిగ్ బాస్. ఒక రోజు  ముందు  పండగ తీసుకువచ్చారు మేకర్స్ సెలబ్రిటీల సందడితో బిగ్ బాస్ వేదిక కలర్ ఫుల్ గా తయారయ్యింది.  ఈసందర్భంగా హైపర్ ఆది సైంటిస్ట్ గా వచ్చి హౌస్ మెంబర్స్ తో ఒక ఆట ఆడుకున్నాడు హైపర్. 


మొదట్లో చాలా చప్పగా అనిపించినా... తరువాత తరువాత  ఇంట్రెస్టింగ్ గా తయారయింది బిగ్ బస్ తెలుగు సీజన్ 6. అంతే ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది బిగ్ బాస్ హౌస్.  చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. . ఇక ఈ వీకెండ్ .. ఆదివారం దిపావళి సంబరాలతో బిగ్ బాస్ వేదిక దడడలాడిపోయింది. హీరోయిన్ల డాన్స్ లతో .. సూపర్ గెస్ట్ లతో  కలర్ ఫుల్ గా తయారయ్యింది. ఈ క్రమంలోనే ఎంటర్టైన్మెంట్ కోసం బుల్లి తెర స్టార్ కమెడియన్ హైపర్ ఆదిని తీసుకువచ్చారు టీమ్. ఇక ఆదీ హౌస్ మెంబర్స్ ను తన ప్రాసలు.. పంచులతో ఓ ఆట ఆడుకున్నాడు. 

వచ్చి రావడంతోనే పంచులతో అదరగొట్టేశాడు ఆది. తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ తో పాటు నాగార్జున మనసు దోచుకున్నాడు. అంతే కాదు ఒక్క కంటెస్టెంట్ బండారం బయట పెడుతూ...  బిగ్ బాస్ స్టేజ్ మీద టాపాసుల మోత మోగించేశాడు హైపర్ ఆది. వచ్చి రావడంతోనే  శ్రీహాన్- ఇనయా మధ్య రహస్యాన్ని బయటపెట్టిన హైపర్ ఆది. ముందుగా గీతు గురించి మాట్లాడుతూ.. పంచు మీద పంచ్ వేశాడు. మా పరివార్ అవార్డ్స్ లాగా మధ్యలో దూరే అవార్డ్ ఇవ్వాలంటే గీతూకు ఇవ్వాలి. అన్నాడు. ఎంతసేపు మైండ్ గేమ్స్ ఆడటం మానేసి..  కాస్త ఫిజిలక్ గా కూడా గేమ్ ఆడాలి అంటూసలహా ఇచ్చాడు ఆది. 

ఇక ఒక్కొక్కరిని ఇండైరెక్ట్ గా  కడిగిపడేస్తూ.. ఎలా ఉండాలి.. ఎలా ఉంటున్నారు చెపుతూ.. చివరిగా పాజిటీవ్ ఎనర్జీ ఇచ్చే ప్రయత్నం చేశాడు హైపర్.   ఆది రెడ్డి గురించి మాట్లాడుతూ.. నువ్వు ఎవరికీ భయబడవు భయ్యా.. కాని ఒక్క సారి నువ్వు బయటకు వచ్చి ఈ ఎపిసోడ్స్ చూసుకో.. నీ డాన్స్ చూసుకుంటే నువ్వే భయపడతావ్,, బయటికి వచ్చి హాట్ స్టార్ లో చూసుకో. 
అంటు ఆదిని ఆడేసుకున్న ఆది.. హౌస్ లో నువ్వు ఉండాలి అంటూ ముగించాడు. 


ఇక అర్జున్ గురించి మాట్లాడుతూ.. టిప్పులిచ్చిజైల్ కు వెళ్ళిన మొదటి వాడివి ప్రపంచంలో నువ్వొక్కడివే అన్నాడు. అంతే కాదు భారతంలో ఆఅర్జునుడు అర్జునుడు పిట్టను కొట్టడానికి ఎంతగురి పెట్టాడో, శ్రీసత్యాను పట్టడానికి అంతకష్టపడుతున్నావ్.  అన్నాడు హైపర్. అటు శ్రీసత్య ను ఉద్ధేశించి కూడా హాట్ కామెంట్స్ చేశాడు ఆది. బిగ్ బాస్ వస్తుందంటే శ్రీసత్య ను చూడటానికి కుర్రాళ్లు టీవీల ముందు కూర్చుంటున్నారు అంటూ చెప్పాడు. ఒక సారి అర్జున్ గురించి కూడా ఆలోచించమంటూ చిన్న సలహా ఇచ్చాడు ఆది. 

ఇక హౌస్ లో లవ్ స్టోరీల గురించి వరుసగా పంచుల బాణాలు వేశాడు ఆది. బిగ్ బాస్ కనుక డైరెక్టర్ సుకుమార్ చూస్తే..ఆర్య వన్ సైడ్ లవ్ లాగా.  సూర్య ఆల్ సైడ్ లైవ్ సినిమా కచ్చితంగా చేస్తాడంటూ నాన్ స్టాప్ గా ఇచ్చి పడేశాడు ఆది. అంతే కాదు ఏ లవ్ స్టోరీలు అవి.. కమల్ హాసన్ గారు చేసేసారు కాని.. నువ్వు బయటకు వచ్చాక ఆకలి రాజ్యం సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు డైరెక్టర్లు.  అంటూ సూర్యను ఉద్దేశించి అన్నాడు. 

అటు శ్రీహాన్ మంచి తనం గురించి మాట్లాడుతూనే.. ఎవరైనా సిరి సంపదల కోసం బిగ్ బాస్ కు వస్తాడు.. శ్రీ హాన్ మాత్రం సంపదతో వెళ్తే చాలు.. సిరి బయట ఉంది అంటూ టైమింగ్ ప్రకారం మాట్లాడాడు. అంతే కాదు ఇనయా శ్రీహాన్ ల బంధం గురించి పదే పదే ఏదో ఒక పంచ్ వేస్తూ వచ్చాడు ఆది. ఇనయా గ్రాఫ్ పెరిగిందని. నువ్వు కాస్త ఒక్కొక్కరిని మార్చకుండ ఉంటే.. నీ గ్రాఫ్ మారకుండా ఉంటుందన్నారు.

ఇలా హౌస్ లో ఒక్కోక్కరి గురించి వరుసగా మాట్లాడుకుంటూ పంచ్ లు వేస్తూ వచ్చాడు ఆది. ఫైమా ప్రవీణ్ గురించి కామెడీ చేసిన ఆది.. దెయ్యం గెటప్ లో కూడా గ్లామర్ గా కనిపించాలని చూసి వాసంతి అమాయకత్వం గురించి మాట్లాడాడు. రేవంత్ గురించి మాట్లాడుతూ  తగ్గేదే లే అన్నావు కాని నీలో పుష్ప కనిపించలేదు ప్రాకశ్ రాజ్ కనిపించాడన్నాడు. అటు రాజ్ ప్రమాణం చేశాడు కాని ఏ భాషలో చేశాడు అని టీజ్ చేశాడు హైపర్ ఆది. 

మొత్తానికి దివాళి సెలబ్రేషన్స్ లో హైపర్ ఆది ఎపిసోడ్ హైలెట్ అయ్యింది. దివాళికి ఆది విసిరిన తారాజువ్లల్లాంటి కామెడీ పంచులకు ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకున్నారు. దివాళి ఎపిసోడ్ మొత్తం మీది హైపర్ ఆది సెగ్మెంట్ బాగా పేలింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ