
హిందువుల పెద్ద పండగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగకు కొత్త వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనడం ఒక సెంటిమెంట్ గా ఉంది. కాగా బిగ్ బాస్ ఫేమ్ హిమజ దీపావళికి తనకు తానే ఖరీదైన గిఫ్ట్ ఇచ్చుకున్నారు . లగ్జరీ బిఎండబ్ల్యు కారును సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. కొత్త కారు పక్కన ఫోజులిస్తూ చేసిన వీడియో ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అయితే ఆ వీడియోలో ఆమె చిన్న ట్విస్ట్ ఇచ్చారు. కారు కొన్నట్లు నిద్రలో కలగన్న భావన కలిగించారు.
అయితే అది కల కాదని, నిజంగానే బీఎండబ్ల్యూ కారు హిమజ సొంతం చేసుకున్నారని ఆమె కామెంట్స్ ద్వారా తెలుస్తుంది. ఈ దీపావళికి నాకు నేనే గిఫ్ట్ ఇచ్చుకున్నాను. నా కలలు నెరవేర్చుకున్నాను అంటూ కామెంట్స్ పెట్టింది. దీంతో అభిమానులు, సన్నిహితులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా హిమజ సొంతింటి కల కూడా నెరవేర్చుకున్నారు. గతంలో నూతన ఇంటి నిర్మాణానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హిమజ పంచుకున్నారు.
చాలా చిత్రాల్లో హిమజ చిన్న చిన్న పాత్రలు చేశారు. బిగ్ బాస్ సీజన్ 3 లో హిమజ పాల్గొన్నారు. హౌస్లో ఆమె పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 9 వారాలు హౌస్లో ఉన్న హిమజ ఎలిమినేటై బయటకు వచ్చేశారు. ఆ షోలో కొంత ఇమేజ్ తెచ్చిపెట్టింది. హిమజకు ఆఫర్స్ వచ్చాయి. ఈ మధ్య సిల్వర్ స్క్రీన్ పై కూడా ఆమెకు కనిపించడం లేదు.