#PawanKalyan:పవన్ సినిమాకు 'హైపర్ ఆది' డైలాగులు

Published : Jan 04, 2023, 09:39 AM IST
 #PawanKalyan:పవన్ సినిమాకు 'హైపర్ ఆది' డైలాగులు

సారాంశం

పవన్‌కల్యాణ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మంచి మనిషి. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకి నేను వర్క్‌ చేస్తున్నా.


జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న హైపర్ ఆది కూడా గతంలో చాలా సార్లు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే అనేక సందర్భాల్లో పవన్ గురించి చెప్తూ వస్తుననారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు పనిచేస్తున్నారు హైపర్ ఆది. రీసెంట్ గా రవితేజ థమాకా చిత్రంలోనూ ఆయన కనిపించి పంచ్ లు వేసారు.  ఆ సినిమా స్క్రిప్టులోనూ పాలు పంచుకున్నారు. హైపర్ ఆది పంచ్ లు బాగా పేలాయి.  ఆ క్రమంలో పవన్ సినిమాకు ఆయన పిలుపు వచ్చిందని చెప్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. పీరియాడిక్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో పవన్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాస్తున్నారు. 

 అయితే.. ఈ సినిమాలో కొన్ని కామెడీ ఎపిసోడ్లు కు ఆది వర్క్ చేసారుట.  ఈ సినిమాలో హైప‌ర్ ఆది కూడా కీ రోల్ చేస్తున్నాడు. అతని కామెడీ టైమింగ్‌, పంచ్‌లూ వాడుకుంటున్నారట.  ఏదైమైనా హైపర్ ఆదికు సినిమాల పరంగా బ్రేక్ వచ్చినట్లే అని చెప్పాలి

 హైపర్ ఆది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. "పవన్‌కల్యాణ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మంచి మనిషి. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకి నేను వర్క్‌ చేస్తున్నా. ఆ వర్క్ మీదే ఇటీవలే నాలుగు రోజులు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పర్సనల్‌గా కలిసాను. ఆయనెంత గొప్ప మనిషో అప్పుడు మరింత అర్థమైంది. మనందరికీ డబ్బు కావాలి. డబ్బు ఎలాంటి మనిషినైనా మార్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం డబ్బు అంటే అస్సలు ఆసక్తి లేదు. అలాంటి వ్యక్తి కచ్చితంగా ఎదుటివారికి మంచి చేయాలనే చూస్తాడు. సినిమాల నుంచి వచ్చిన సొమ్ముని కౌలు రైతులకు సాయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఒక సినిమా చేస్తే 50 కోట్లు వస్తే ఆ మొత్తం పేదలకు సాయం చేయడానికి, పార్టీ కార్యకలాపాలకు, పార్టీ కోసం పనిచేస్తోన్న వారికే ఇచ్చేస్తారు. అందరి మంచి కోరుకునే వ్యక్తికి మంచి జరగాలని కోరుకుంటాను” అని తెలిపారు.

 ఇక షూటింగ్ విషయానికి వస్తే...సుమారు 20 రోజులపాటు సాగే ఈ షెడ్యూల్లో పవన్ పై కొన్ని యాక్షన్ అండ్ కీలక సన్నివేశాలను చిత్రీకరించినన్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక సెట్ ని రూపొందించినట్లు తెలుస్తుంది. హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి(Nargis Fakri) కీలక పాత్రలో కనిపించనున్నారు. 

మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ  భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రముఖ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాడు. కీలకమైన షెడ్యూల్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్‌ను రూపొందించారు. పవన్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతంగా స్పందన వచ్చింది. ఇందులో పవన్‌ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Epiosde: వల్లి గురించి నిజం మొత్తం కక్కేసిన నకిలీ డాక్టర్.. చెంప పగలగొట్టిన వేదవతి
Aishwarya Lekshmi: ఎంబీబీఎస్ చదివా, కానీ డాక్టర్‌ని కాలేదు.. ఐశ్వర్య లక్ష్మి కామెంట్స్