హాస్పిటల్ లో హైదరాబాద్ కమెడియన్, కరోనా అంటూ ప్రచారం, నిజం ఇదే!

Published : Jun 09, 2020, 01:01 PM IST
హాస్పిటల్ లో హైదరాబాద్ కమెడియన్,  కరోనా అంటూ ప్రచారం, నిజం ఇదే!

సారాంశం

కరోనా వైరస్ మహమ్మారి మన దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా తెలంగాణాలో చాప కింద నీరులా విస్తరిస్తోంది.   లాక్ డౌన్ లో కంట్రోల్ లో ఉన్న వైరస్ ఇప్పుడు నిబంధనలు సడలించడంతో విజృంభిస్తోంది. దాంతో కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా హైదరాబాద్ కు చెందిన కమెడియన్ కూడా ఈ మహమ్మారి సోకినట్టుగా మీడియాలో  ప్రచారం సాగుతోంది. 

దక్కన్ హిందీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్బర్ బిన్ తబర్ కూడా కరోనా బారిన పడినట్లుగాకేర్ హాస్పటిల్ లో చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఈ విషయమై గుల్లూ దాదాగా పేరు తెచ్చుకున్న అద్నాన్ సాజిద్ ఖాన్ ఓ వీడియో విడుదల చేసారు. అందులో ..అక్బర్ హాస్పటిల్ లో చేరిన వార్త నిజమే అని, అయితే టైఫాయిడ్ కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలియచేసారు.

ఇక..అక్బర్ బిన్ తబర్ ఇంతకు ముందు కృష్ణవంశీ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘పైసా’లో అక్బర్ నటించాడు. లోకల్ హిందీ చిత్రాలతో క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం అక్బర్ ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స చేస్తున్నట్టు సమాచారం.  అయితే ఆస్పత్రి వర్గాల నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

PREV
click me!

Recommended Stories

850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు