బాలయ్య, రాంచరణ్ కి షాకిచ్చిన వరుణుడు..!

By Asianet NewsFirst Published Apr 26, 2023, 6:37 PM IST
Highlights

అకాల వర్షం కారణంగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అనిల్ రావిపూడి చిత్రం.. రాంచరణ్, శంకర్ ల గేమ్ ఛేంజర్ చిత్రాలు ఎఫెక్ట్ అయినట్లు తెలుస్తోంది.

సమ్మర్ సీజన్ లో అటు తెలంగాణ, ఇటు ఏపీ రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాల వల్ల రైతులే కాదు.. చిత్ర పరిశ్రమ కూడా నష్టపోతోంది. మంగళవారం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా సెట్స్ పై ఉన్న పలు చిత్రాల చిత్రీకరణ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా అకాల వర్షం కారణంగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అనిల్ రావిపూడి చిత్రం.. రాంచరణ్, శంకర్ ల గేమ్ ఛేంజర్ చిత్రాలు ఎఫెక్ట్ అయినట్లు తెలుస్తోంది. మంగళవారం రోజు కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ రెండు చిత్రాల షూటింగ్ బుధవారం రోజు ఆగిపోయినట్లు తెలుస్తోంది. 

Latest Videos

ప్రస్తుతం ఎన్బీకే 108 కోసం బాలయ్య ఒక భారీ యాక్షన్ సన్నివేశంలో నటిస్తున్నారు. అవుట్ డోర్ షూటింగ్ కావడంతో దర్శకుడు అనిల్ రావిపూడి నేడు జరగాల్సిన షూట్ ని వాయిదా వేశారు. ఈ యాక్షన్ సన్నివేశం ఇంకా 50 శాతం పూర్తి కావాల్సి ఉంది. దీనితో వచ్చే వారం కూడా షూటింగ్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. 

అదే సయమంలో డైరెక్టర్ శంకర్ శంషాబాద్ ప్రాంతంలో 1000 మంది పైగా ఫైటర్స్ తో రాంచరణ్ పై క్లైమాక్స్ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇది కూడా అవుట్ డోర్ షూటింగ్ కావడంతో వర్షాల కారణంగా వాయిదా పడింది. వాతావరణం అనుకూలించకపోతే డైరెక్టర్ శంకర్ కొన్ని షూట్స్ ని ఇండోర్ లో చిత్రీకరిస్తారట. 

ఈ రెండు చిత్రాలతో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థలు కూడా తమ షూటింగ్స్ ని వాయిదా వేసుకున్నాయి. సెట్స్ కి వెళ్లి షూటింగ్ మొదలయ్యాక వర్షం పడితే నష్టం మరింత ఎక్కువ అవుతుంది. 

click me!