Bheemla Nayak prerelease business:రికార్డు స్థాయిలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్!

Published : Feb 09, 2022, 03:16 PM IST
Bheemla Nayak prerelease business:రికార్డు స్థాయిలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్!

సారాంశం

భీమ్లా నాయక్ (Bheemla Nayak prerelease business)థియేట్రికల్ హక్కులు రూ. 100 కోట్లను దాటేశాయట. ఒక్క కర్ణాటక ఏరియాకు గాను రూ. 9.6 కోట్లకు అమ్ముడయ్యాయట. డిమాండ్ రీత్యా భీమ్లా నాయక్ హక్కుల కోసం బయ్యర్లు పోటీపడుతున్నారట. ఫైనల్  ఫిగర్ భారీగానే ఉంటుందని సమాచారం. 

మార్చి 25న భీమ్లా నాయక్ (Bheemla Nayak) విడుదల దాదాపు ఖాయమే. రేపు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇండస్ట్రీ పెద్దలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పరిశ్రమ సమస్యలకు పరిష్కారం దొరకడం తధ్యమని అందరూ భావిస్తున్నారు. టికెట్స్ ధరలు పెంపు, యాభై శాతం  ఆక్యుపెన్సీ ఎత్తివేస్తే భీమ్లా నాయక్ విడుదలకు అడ్డంకులు తొలగినట్లే. తాజా చర్చల్లో సానుకూల ఫలితాలు వస్తాయని ఇండస్ట్రీ వర్గాల నమ్మకం. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ థియేట్రికల్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. 

తాజా సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ (Bheemla Nayak prerelease business)థియేట్రికల్ హక్కులు రూ. 100 కోట్లను దాటేశాయట. ఒక్క కర్ణాటక ఏరియాకు గాను రూ. 9.6 కోట్లకు అమ్ముడయ్యాయట. డిమాండ్ రీత్యా భీమ్లా నాయక్ హక్కుల కోసం బయ్యర్లు పోటీపడుతున్నారట. ఫైనల్  ఫిగర్ భారీగానే ఉంటుందని సమాచారం. పవన్ కళ్యాణ్ గత చిత్రం వకీల్ సాబ్ రూ. 135 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు రాబట్టింది. భీమ్లా నాయక్ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. మూవీ ఓ రేంజ్ లో ఉందట. అందుకే బయ్యర్లు పోటీపడుతున్నారు. 

భీమ్లా నాయక్ మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. ఇక రానా దగ్గుబాటి కీలక రోల్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ మూవీ వీరిద్దరి మధ్య నడిచే ఆధిపత్య పోరని చెప్పొచ్చు. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అయ్యప్పనుమ్ కోశియుమ్ కథకు తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేశారు. స్క్రీన్ ప్లేతో పాటు మాటలు అందించారు. భీమ్లా నాయక్ చిత్రానికి అన్నీ తానై నడిపాడు. 

ఇంకా రెండు రోజుల షూటింగ్ పార్ట్ మిగిలి ఉండగా పవన్ పూర్తి చేయాల్సి ఉంది. పవన్ కి జంటగా నిత్యా మీనన్ నటిస్తున్నారు. కెరీర్ లో మొదటి సారి వీరిద్దరూ జతకడుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన భీమ్లా నాయక్, ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ఒత్తిడితో వాయిదా పడింది.
 
ఇక కమ్ బ్యాక్ తర్వాత వరుస చిత్రాలు ప్రకటించారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సెట్స్ పై ఉంది. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్, సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో ఒక మూవీ చేయాల్సి ఉంది . సాయి ధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ చేయనున్నట్లు సమాచారం అందుతుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం