తాగి గొడవ చేసిన నటుడు.. పోలీసులు వార్నింగ్!

By Udayavani DhuliFirst Published 11, Sep 2018, 11:05 AM IST
Highlights

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎలాంటి వివాదాలకు పాల్పడుతున్నా అవి వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కన్నడ నటుడు మద్యం సేవించి తనేం చేస్తున్నాడో.. తనకే తెలియని పరిస్థితిలో ఓ బేకరీని నాశనం చేశాడు

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎలాంటి వివాదాలకు పాల్పడుతున్నా అవి వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కన్నడ నటుడు మద్యం సేవించి తనేం చేస్తున్నాడో.. తనకే తెలియని పరిస్థితిలో ఓ బేకరీని నాశనం చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. కన్నడ నటుడు హుచ్చ వెంకట్ తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఇప్పుడు మరో వివాదంతో వార్తల్లోకెక్కాడు. రాత్రంతా మద్యం ఎక్కువగా తీసుకొని ఉదయం ఆ మత్తు దిగకుండానే దగ్గరలో ఓ బేకరీకి వెళ్లి గొడవ చేశాడట. అతడి చర్యలతో షాక్ తిన్న బేకరీ యజమాని ఆ తరువాత అతడికి ఎదురుతిరిగాడు.

దీంతో హుచ్చ వెంకట్ కి మరింత కోపం వచ్చి సెలబ్రిటీ అయిన నాపైనే ఎదురు తిరుగుతావా అంటూ బేకరీలో ఉన్న వస్తువులను నాశనం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బేకరీ యజమాని పోలీసులకు సమాచారం అందించగా.. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుచ్చ వెంకట్ ని హెచ్చరించి అతడిపై కేసు పెట్టకుండా పంపించినట్లు సమాచారం.  

Last Updated 19, Sep 2018, 9:22 AM IST