'మణికర్ణిక' నుండి ప్రొడ్యూసర్ అవుట్.. కారమేమిటంటే..?

By Udayavani DhuliFirst Published Sep 10, 2018, 6:27 PM IST
Highlights

ఈ మధ్యకాలంలో ఏ ప్రాజెక్ట్ నుండి కూడా ఇంతమంది బయటకి వెళ్లినట్లు లేరు కానీ 'మణికర్ణిక' సినిమా విషయంలో మాత్రం ఒక్కొక్కరుగా బయటకి వెళ్లిపోతున్నారు. దీనికి రకరాల కారణాలు చెబుతున్నారు.

ఈ మధ్యకాలంలో ఏ ప్రాజెక్ట్ నుండి కూడా ఇంతమంది బయటకి వెళ్లినట్లు లేరు కానీ 'మణికర్ణిక' సినిమా విషయంలో మాత్రం ఒక్కొక్కరుగా బయటకి వెళ్లిపోతున్నారు. దీనికి రకరాల కారణాలు చెబుతున్నారు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రస్తుతం హీరోయిన్ కంగనా రనౌత్ టేకప్ చేసింది.

క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ తో బిజీగా ఉండడంతో ఆ బాధ్యతలు కంగనాకు అప్పగించారు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తయింది. మిగిలిన ప్యాచ్ వర్క్ కంగనా నేతృత్వంలో జరుగుతోంది. కంగనా డైరెక్టర్ అనే విషయం సోనూ సూద్ కి నచ్చక ఆయన ప్రాజెక్ట్ నుండి వాకౌట్ చేశాడు. దర్శకురాలిగా కంగనాకి ఏం అర్హత ఉందని ఆయన మీడియా ముఖంగా అన్నారు.

తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి నిర్మాత సంజయ్ కుట్టి కూడా తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు కొత్త నిర్మాతలు ఈ సినిమాను టేకప్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. రూ.70 కోట్లు అనుకున్న బడ్జెట్ కాస్త ఇప్పుడు రూ.100 కోట్లకు చేరుకోవడం, విడుదల కూడా వాయిదా పడే అవకాశాలు ఉండడంతో నిర్మాత ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని టాక్. 

click me!