స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట తీవ్ర విషాదం, సినీ ప్రముఖుల సంతాపం

Published : Jun 18, 2022, 05:30 PM IST
 స్టార్ హీరో హృతిక్ రోషన్  ఇంట తీవ్ర విషాదం, సినీ ప్రముఖుల సంతాపం

సారాంశం

స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న హృతిక్ అమ్మమ్మ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.   

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్  ఇంట విషాదం చోటు చేసుకుంది. హృతిక్ అమ్మమ్మ, పద్మా రాణి ఓంప్రకాష్ (91) ముంబైలో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. అయితే కోలుకోలేక శుక్రవారం తుదిశ్వాస విడిచారామె. వయసు సంబంధిత సమస్యలకు తోడు తీవ్ర అనారోగ్యంతో పద్మారాణి గత కొన్నేళ్లుగా హృతిక్‌ తల్లి పింకీ రోషన్‌ దగ్గరే ఉంటోంది. 

 దివంగత ఫిల్మ్ మేకర్ జే ఓం ప్రకాష్ భార్యే పద్మా రాణి. ఈ దంపతుల కుమార్తెనే పింకీ రోషన్. జే ఓం ప్రకాష్ఆప్ కీ కసమ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. రాజేష్ ఖన్నా ఈ మూవీలో  హీరోగా నటించారు. ఈ మూవీ 1974లో విడుదలైంది. ఆతర్వాత హీరో జితేంద్రతో కలసి ఓం అనేక చిత్రాల్లో పనిచేశారు. ఆషా , అర్పన్, ఆద్మీ ఖిలోనా హై, ఆయీ మిలన్ కి బేలా, ఆస్ కా పంచీ, ఆయే దిన్ బహర్ కే , ఆంఖోన్ ఆంఖోన్ మే, అయా సావన్ ఝూమ్ కే వంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాలను కూడా నిర్మించారు.

 

జే ఓంప్రకాష్ 93 ఏళ్ల వయసులో  2019న మరణించారు. ఇప్పుడు ఆయన సతీమణి కూడా కన్నుమూశారు. కాగా పద్మారాణి మరణాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది పింకీ రోషన్‌.. నా తల్లి పద్మా రాణి ఓంప్రకాష్ నా తండ్రిని కలవడానికి ఈ లోకం నుంచి విడిచి వెళ్లిపోయింది అంటూ.. ఎమోషనల్‌ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. దీంతో పలువురు ప్రముఖులు హృతిక్‌ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?