మూడోసారి సింగర్ గా హృతిక్ రోషన్.. ఈసారి క్రిష్ 4లో అదిరిపోయే సాంగ్!

By telugu teamFirst Published Oct 28, 2021, 8:58 AM IST
Highlights

బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రిష్ సిరీస్ ప్రాంఛైజీతో ఇండియాలో సూపర్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. హృతిక్ కటౌట్ కూడా అలాగే ఉంటుంది.

బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రిష్ సిరీస్ ప్రాంఛైజీతో ఇండియాలో సూపర్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. హృతిక్ కటౌట్ కూడా అలాగే ఉంటుంది. హృతిక్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ అభిమానులంతా క్రిష్ 4 కోసం ఎదురుచూస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు దేశవ్యాప్తంగా క్రిష్ సిరీస్ కు అభిమానులు ఉన్నారు. 

ప్రస్తుతం Krrish 4 చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. Hrithik Roshan తండ్రి, దర్శకుడు రాకేష్ రోషన్ ప్రస్తుతం స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. క్రిష్ సిరీస్ కు హృతిక్ పెదనాన్న రాజేష్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ 4 కి కూడా ఆయనే సంగీత దర్శకుడు. తాజాగా రాజేష్ క్రిష్ 4 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 

నా సోదరుడు ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. స్క్రిప్ట్ పూర్తి కాగానే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం అవుతాయి. అయితే మీకొక హామీ ఇస్తున్నాను . ఈ చిత్రంలో హృతిక్ చేత తప్పకుండా ఓ పాట పాడిస్తా. హృతిక్ గాత్రంతో వినసొంపైన పాటని మీకు అందిస్తా అని రాజేష్ తెలిపారు. 

హృతిక్ రోషన్ గతంలో రెండు చిత్రాల్లో పాటలు పాడారు. ‘జిందగీ నా మిలేగీ',  ‘కైట్స్’ చిత్రాల్లో హృతిక్ రోషన్ పాటలు పాడారు. దీనితో క్రిష్ 4పై ఆసక్తి నెలకొంది. టెక్నికల్ గా క్రిష్ 4 మూవీ హై స్టాండర్డ్స్ లో ఉండబోతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా Priyanka Chopra ని కొనసాగిస్తారా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. 

అయితే కథ గురించి కూడా లీకులు వస్తున్నాయి. ఏలియన్ జాదు తిరిగి వస్తాడని టాక్. దీనితో కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం హృతిక్ విక్రమ్ వేద రీమేక్ లో నటిస్తున్నాడు. 

click me!