
బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరుగాంచిన హృతిక్ రోషన్, సుసానే ఖాన్ లు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 14ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత హృతిక్- సుసానే ఖాన్‌లు 2014లో విడిపోయారు.. ప్రస్తుతం హృతిక్ బాలీవుడ్ నటి, సింగర్ సబా అజాద్‌తో డేటింగ్ చేస్తుండగా, సుసానే ఇప్పుడు అర్స్లాన్ గోనీతో పీకల్లోతు ప్రేమలో ఉంది.
హృతిక్ తో విడిపోయిన తరువాత సుసానే మరో బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కుంది.తన అర్స్లాన్ గోనీతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. ఇక తాజగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త బాలీవుడ్ లో తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే సుసానేకు ఇది రెండో పెళ్లి కావడం వల్ల.. వీరి మ్యారేజ్ చాలా సింపుల్ గా ఉండబోతోందని సమాచారం. అయితే వీరి పెళ్లి ఎప్పుడు.. ఎక్కడా.. డేట్ టైమ్ సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బీటౌన్‌లో అందరికి తెలిసిందే. తరచూ వీరిద్దరు ముంబై రోడ్లపై చట్టపట్టాలేసుకుని తిరగడం,డిన్నర్ డేట్స్‌కు వెళ్లేవారు.
హృతిక్ రోషన్, సుసానేలు 14 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోయారు. వీరికి ఇద్దరుతనయులు ఉన్నారు. ఇద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ... తమ పిల్లలు ఒంటరివారు కాకూడదని.. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి సమయాన్ని గడుపుతుంటారు. విడిపోయినా మంచి ఫ్రెండ్స్ గా కలిసుంటుంటారు బాలీవుడ్ కపుల్. అంతే కాదు ఒకరికి ఒకరు ప్రతీ విషయంలో సపోర్ట్ చేసుకుంటుంటారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తో హృతిక్ రోషన్ కు వివాదం నడుస్తున్న సమయంలో కూడా తన మాజీ భర్తకు ఆమె మద్దతుగా నిలిచారు.