
ఓటీటీల తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన మళయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) . అల్లు అర్జున్ పుష్ప లో విలన్ గా చేయటంతో అతడి క్రేజ్ ఇంకా పెరిగింది. దాంతో ఆయన నటించిన సినిమాలు తెలుగులో డబ్ చేసి ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. ఆ క్రమంలో ట్రాన్స్, అతడి దొంగాట లాంటి సినిమాలు రిలీజ్ ఇయ్యి...ఇక్కడ మంచి విజయం అందుకున్నాయి. తాజాగా ఫహాద్ గతేడాది నటించిన మరో చిత్రం ‘మాలిక్’ (Malik)కూడా ఇప్పుడు తెలుగులోకి తీసుకువస్తున్నారు.
‘టేకాఫ్, సీయూ సూన్’ తర్వాత ఫహద్-మహేష్ నారాయణన్ కాంబోలో వచ్చిన మూవీ ఇది. ‘గాడ్ ఫాదర్, నాయకన్(నాయకుడు), అభిమన్యు(1991 మలయాళం), వన్స్ అపాన్ ఎ టైం ఇన్ అమెరికా’.. ఇలా టైంలైన్ కథల తరహాలో సాగే డాన్ కమ్ పొలిటికల్ థ్రిల్లర్ కథల తరహాలోనే ‘మాలిక్’ ఉంటుంది. 60వ దశకం నుంచి 2000 వరకు టైం లైన్‌గా మాలిక్ కథ సాగుతుంది.
ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ ఇది. కరోనా కారణంగా గతేడాది ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ఓటీటిలో రికార్డ్ లు బ్రద్దలు కొట్టింది. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ నటన కు అంతటా ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఆహా’ వేదికగా ఆగస్టు 12వ తేదీ నుంచి ‘మాలిక్’ స్ట్రీమింగ్ కానుంది. ఫహద్ ఫాజిల్‌తో పాటు నిమిషా సంజయన్, వినయ్ ఫోర్ట్, జోజూ జార్జ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను ‘ఆహా’ విడుదల చేసింది. ఆ ట్రైలర్ మీరూ చూడండి.
ఈ చిత్రం కథ.... బంధువుల కోలాహలం నడుమ హజ్ యాత్రకు బయలుదేరుతాడు సులైమాన్ అలీ అహమ్మద్ అలియాస్ మాలిక్ అలియాస్ అలీ ఇక్కా(ఫహద్ ఫాజిల్). అయితే ఎయిర్‌పోర్ట్‌లోనే ఆ పెద్దాయనను పోలీసులు అరెస్ట్ చేస్తారు. గతంలో జరిగిన ఓ హత్య కేసుతో పాటు మరికొన్ని నేరాల కింద కేసులు నమోదు చేసి అతన్ని జైళ్లో పెడతారు. అనూహ్యంగా మాలిక్ తల్లి జలజ అప్రూవర్‌గా మారిపోయి వ్యతిరేకంగా సాక్క్ష్యం చెప్పేందుకు ముందుకొస్తుంది. మరోవైపు భార్య రోస్లిన్ మాత్రం ఆయన్ని ఎలాగైనా బయటకు తెప్పించే ప్రయత్నం చేస్తుంటుంది. ఆ క్రమంలో జరిగిన సంఘటనలు,మాలిక్ గతం చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి.
బ్యానర్: ఆంట్స్ టు ఎలిఫెంట్
డైరెక్టర్: మహేష్ నారాయణన్
కాస్టింగ్: ఫహద్ ఫాజిల్, నిమిషా సజయన్, వినయ్ ఫోర్రట్, జోజూ జార్జ్, దిలీష్ పోతన్, ఇంద్రాన్స్, పార్వతి కృష్ణ, సనల్ అమన్ తదితరులు
పాటలు, మాటలు: సామ్రాట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :శ్రీనివాస మూర్తి నిడదవోలు
సహా నిర్మాత: వి. జయప్రకాష్
నిర్మాతలు: అనీల్. కె. రెడ్డి, కిషోర్ రెడ్డి
సమర్పణ: మోజ్విత్ & నినిన్