కంగనా వివాదంపై హృతిక్ కామెంట్స్!

Published : Jul 09, 2019, 11:48 AM IST
కంగనా వివాదంపై హృతిక్ కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ల మధ్య వివాదం గురించి తెలిసిందే. 

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ల మధ్య వివాదం గురించి తెలిసిందే. కొంతకాలం పాటు సహజీవనం చేసిన ఈ జంట ఆ తరువాత విడిపోయి శత్రువులుగా మారారు. కంగనా, ఆమె సోదరి రంగోలి ఛాన్స్ వచ్చినప్పుడల్లా.. హృతిక్ ని విమర్శిస్తూనే ఉంటారు.

ఇప్పటికే చాలాసార్లు హృతిక్ పై మండిపడ్డారు. కానీ హృతిక్ ఎప్పుడూ కూడా ఈ వివాదంపై బయట పెద్దగా స్పందించలేదు. ఇటీవల హృతిక్ నటించిన 'సూపర్ 30', కంగనా నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాలు ఒకేసారి విడుదల చేయడానికి సిద్ధం చేశారు. 

దీంతో మరోసారి వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీంతో హృతిక్ వెనక్కి తగ్గి సినిమా విడుదల వాయిదా వేసుకున్నాడు. తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హృతిక్.. కంగనా వివాదంపై స్పందించాడు. అవతలివారు గొడవకి దిగినా తాను వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్లు.. గొడవకి దిగడాన్ని ఎంజాయ్ చేసేవారిని ఇకపై అలాంటి అవకాశం ఇవ్వదలచుకోలేదని చెప్పాడు.

ఆరేళ్లుగా ఈ సర్కస్ ని కొనసాగిస్తూనే ఉన్నారని కంగనాపై సెటైర్లు వేశారు. చట్టబద్దమైన పోరాటానికి నేరుగా తాను దిగలేదని.. ఇండియాలో ఓ యువకుడు మహిళలకు వ్యతిరేకంగా చట్టబద్దంగా పోరాడడం అనే దానికి ముగింపు ఉండదని చెప్పాడు. అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని అన్నాడు.  

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?