శ్రీకాంత్ శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్ కలిసి నటించిన హార్రర్ ఫిల్మ్ ‘పిండం’. తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. థ్రిల్లింగ్ అంశాలతో చాలా ఆసక్తికరంగా మారింది. సినిమాపై హైప్ ను పెంచేసింది.
తమిళ నటుడు శ్రీకాంత్ శ్రీరామ్ (Srikanth Sri Ram) కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. మరోవైపు దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas) కూడా విభిన్న కథలతో ప్రేక్షకులను అరిస్తూనే ఉన్నారు. తాజాగా వీరిద్దిరి కాంబోలో ఓ హార్రర్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ చిత్రమే ‘పిండం’ (Pindam). కళాహి మీడియా బ్యానర్ పై ఈ చిత్రాన్ని యశ్వంత్ దగ్గుమటి నిర్మించారు. ఈ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం.
ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ ను ప్రారంభించారు. ఇప్పటికే ఆడియెన్స్ ముందుకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ ఆకట్టుకుంది. తాజాగా గూస్ బంప్స్ తెప్పించే ట్రైలర్ ను విడుదల చేశారు. Pindam Trailer విషయానికొస్తే.. మరణం తర్వాత ఏం జరుగుతుంది? కోరికలు తీరని ఆత్మలు భూమిపైనే ఉంటాయా? అనే ప్రశ్నతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆత్మలు నిజంగానే హానీ చేస్తాయా? అనే కోణం నడుస్తుంది. ఊరికి దూరంగా ఉన్న ఓ ఇంటిలోకి శ్రీరామ్ తన తల్లి, భార్య, పిల్లలతో దిగుతాడు. ఓ రోజు ఇంటిలో అనుమాన సంకేతాలు కనిపిస్తాయి. అంతలోనే అతని కూతురు తనతో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందని తల్లితో చెబుతుంది.
undefined
అప్పటి నుంచి ఇంట్లో వరుస ఘటనలు జరుగుతుంటాయి. విషయాన్ని అతీత శక్తులు ఉన్న ఈశ్వరీరావు సమస్యను గుర్తిస్తుంది. శ్రీరామ్ చిన్నకూతురుకు ప్రమాదం ఉందని చెబుతుంది. అమావాస్య రోజు సమస్యకు పరిష్కరించేందుకు కొన్ని పూజలు చేస్తారు. ఆరోజు కుదరకపోతే మళ్లీ వేచి ఉండాల్సి వస్తుందని చెబుతుంది. ఇంతకీ ఆరోజు పరిష్కారం దొరికిందా? లేదా? ఇంతకీ తన చిన్న కూతురుతో మాట్లాడుతున్నది ఎవరు? నిజంగా ఆత్మలేనా? ఇలాంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.
అయితే, ఈ చిత్రాన్ని ట్రూ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించడం ఆసక్తికరంగా మారింది. ఒక వస్తువును పూడ్చినా, తగలబెట్టినా దానిలో ఉన్న అంతర్గత ఎనర్జీని ఎప్పటికీ నిర్మూలించలేమంటూ.. ట్రైలర్ చివర్లో చెప్పిన సైంటిఫిక్ రీజన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. హార్రర్ థ్రిల్లర్ అయినా కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక సాయికిరణ్ దైడ దర్శకత్వం వహించారు. సతీష్ మనోహారన్ సినిమాటోగ్రఫీ అందించారు. కృష్ణ సౌరబ్ సురంపల్లి నేపథ్య సంగీతం బాగుంది. ఈ చిత్రం 2023 డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు ఇంకా వారం రోజుల సమయమే ఉంది.