నాని ఫిట్ నెస్ సీక్రెట్, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నేచురల్ స్టార్ ..

By Mahesh JujjuriFirst Published Dec 7, 2023, 12:46 PM IST
Highlights

ప్రస్తుతం హాయ్ నాన్న సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. నిన్నటి వరకూ ఈమూవీ ప్రమోషన్స్ లో బాగా అలసిపోయాడు. ఈక్రమంలో నాని ఫిట్ నెస్ కు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే..?

నేచురల్ స్టార్ నాని  సినిమాల్లో,, బయట చాలా నేచురల్ గా ఉంటారు. సింపుల్ గా.. పెద్దగా హడావిడి ఉండదు. ఆయన ఫిట్ నెస్ కాని.. హెల్త్ కాని, గ్లామర్ కాని.. కెరీర్ బిగినింగ్ లో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే మెయింటేన్ చేస్తున్నారు. చిన్న చిన్న మార్పులు తప్పించి.. నానిలో పెద్దగా మార్పులు లేవు. మన పక్కింటి కుర్రాడిలా ఉంటారు నాని. మరి ఆయన అంత ఫిట్ గా ఎలా మెయింటేన్ చేస్తున్నారు. భారీగా జిమ్ములు గట్రా చేయకుండా.. తన గ్లామర్ ను ఎలా కాపడుకుంటున్నారు. రీసెంట్ గా తన  ఫిట్‌నెస్‌పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ఫిట్‌నెస్‌ గురించిన ఓ ప్రశ్న ఎదురైంది. 

ఫిట్ నెస్ గురించి మాట్లాడుతూ.. శరీరాన్ని టార్చెర్ పెట్టకూడదన్నారు నాని.  తాను ఎప్పుడూ పని చేస్తూ ఉంటానని అన్నారు. ఉంటూ లేవకుండా.. పని చేయకుండా ఉంటే అది కచ్చితంగా బరువు పెరగడానికి కారణమవుతుందని  అన్నారు. అలా అని తాను ఏదైనా తినేస్తానని తాను చెప్పనన్నారు. ఎందుకంటే హీరోగా మెయింటే చేయడం అంటే కొన్నిత్యాగం చేయకతప్పదన్నారు.  తనకు తెలిసిన వాళ్లు డైట్‌ పేరిట తినడం మానేశారని, కొద్దిరోజుల తర్వాత మళ్లీ బరువు పెరుగుతున్నారని చెప్పారు. వాళ్లు శరీరాన్ని టార్చర్‌ చేయటం వల్లే అలా జరుగుతోందని అన్నారు. చిన్నప్పటినుంచి మనం తినే దానికే శరీరం అలవాటు పడుతుందని చెప్పారు.

Latest Videos

చిన్నప్పటినుంచి మనం తిన్న ఫుడ్ మన శరీరానికి కరెక్ట్ గా సెట్ అవుతుంది. అదే కంటీన్యూ చేయడం మంచిది.. ఉదాహరణకు ఇంట్లో అమ్మ వండే పిండి వంటలు అలవాటు ఉంటే తినొచ్చని, కానీ, అమితంగా తినకూడదని చెప్పారు. ప్రతి రోజూ ఇంట్లో భోజనం తింటూ.. ఒకే రోజు సడెన్‌గా సలాడ్‌లు తింటే బాడీ తట్టుకోలేదని చెప్పారు. బాడీ రెడీగా ఉండదని వివరించారు. ఆ విషయం తనకు అర్థం అయిందని అన్నారు. ఎవరు.. ఎదైనా తినవచ్చని కానీ అమితంగా తింటేనే ప్రాబ్లమ్ వస్తుంది.. తిండి విషయంలో ఎంత ఇష్టం ఉన్నా.. కంట్రోల్‌లో ఉండాలి అంటున్నారు నాని. 

ఇక తాజాగా హాయ్ నాన్న సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు నేచురల్ స్టార్. ఈమూవీ పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతోంది. చూసిన అందరు బాగుంది అంటున్నారు. దాంతో టీమ్ దిల్ ఖుష్ అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ ఈసినిమాలో హీరోయిన్ గా నటించగా.. శౌర్యప్ డైరెక్ట్ చేశారు. పాన్ ఇండియా రేంజ్ లో 5 భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయగా.. నాని ప్రమోషన్స్ కోసం ఇండియాతో పాటు..అమెరికా కూడా వెళ్ళి వచ్చారు. 

click me!