Rashmika Mandanna Tweet : విజయ్ థళపతిపై రష్మిక మండన్న ఇన్ని ఆశలు పెట్టుకుందా.? ఇంట్రెస్టింగ్ ట్వీట్..

Published : Apr 07, 2022, 03:51 PM IST
Rashmika Mandanna Tweet :  విజయ్ థళపతిపై రష్మిక మండన్న ఇన్ని ఆశలు పెట్టుకుందా.? ఇంట్రెస్టింగ్ ట్వీట్..

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికా మండన్న (Rashmika Mandanna) ఫుల్ స్వింగ్ లో ఉంది. తాజాగా రష్మిక, తమిళ స్టార్ హీరో విజయ్ థళపతితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ గురించి ఇంట్రెస్టింగ్ గా ట్వీట్ చేసిందీ బ్యూటీ. 

యంగ్ హీరోయిన్ రష్మికా మండన్న సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇన్నాళ్లు టాలీవుడ్ ను ఊపూపిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లోనూ అవకాశాలను  దక్కించుకుంటోంది. త్వరలో నార్త్ ఆడియెన్స్ ను అలరించనుంది. ఇప్పటికే పుష్ఫ (Pushpa) హిందీ వెర్షన్ తో శ్రీవల్లి హిందీ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ప్రస్తుతం డైరెక్ట్ హిందీ సినిమాలు చేస్తూ తన హవా కొనసాగనుంది. ప్రస్తుతం హిందీలో ‘మిషన్ మజ్ను’ సినిమాలో నటిస్తోంది. మరో రెండు హిందీ సినిమాలకు కూడా సైన్ చేసిందీ బ్యూటీ. తాజాగానూ తెలుగులోనూ మరో సినిమాను ప్రకటించింది రష్మిక మండన్న.

నిన్ననే ఇలయ దళపతి విజయ్ (Vijay Thalapathy) నటించబోతున్న మొట్టమొదటి తెలుగు చిత్రం షురూ అయింది. ఈ చిత్రంలో రష్మిక మండన్న విజయ్ సరసన నటించనుంది. అయితే చాలా కాలంగా 'మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఎట్టకేళకు నిర్మాత దిల్ రాజు కూడా ఈ కాంబినేషన్ ను కన్ఫామ్ చేస్తూ నిన్న చెన్నైలో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. వంద కోట్లకు పైగా బడ్జెట్ లో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. వంశీ పైడి పల్లి విజయ్ ఇమేజ్ కు తగ్గట్లుగా యాక్షన్ అండ్ మెసేజ్ తో కూడుకున్న పవర్ ఫుల్ కథని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

అయితే, ఈ సినిమా పూజా కార్యక్రమం పూర్తైన సందర్భంగా సందర్భంగా రష్మిక సంతోషంతో ఎగిరి గంతేస్తోంది. ఈ మేరకు చిత్ర యూనిట్, విజయ్, నిర్మాత దిల్ రాజ్ తో కలిసి దిగిన ఫొటోలను తన ట్వీట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ క్రమంలో విజయ్ తో సినిమా చేసేందుకు రష్మిక చాలా సంవత్సరాలుగా చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో తన కల నెరవేరబోతున్నట్టు చెప్పింది. ఈ సంద్భంగా తన ట్వీట్ చేస్తూ.. ‘ఇంకేదో అనిపిస్తుంది.. ఇన్నాళ్లుగా సార్ ను చూస్తున్నాను.  ఇప్పుడు నేను చేయాలనుకున్నదంతా చేయడానికి.. ఒక అవకాశం దక్కింది. అతనితో నటించడానికి, డ్యాన్స్ చేయడానికి, మాట్లాడటానికి.. ఇలా అన్నీ.. ఎట్టకేలకు! ఒక సంపూర్ణ ఆనందం దక్కింది’ అంటూ చెప్పుకొచ్చింది.  మరోవైపు విజయ్ బీస్ట్ Beast చిత్రం ఏప్రిల్ 13న రిలీజ్ కానుంది.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా