హాలీవుడ్ లో విషాదం, స్టార్ యాక్టర్ ఆండ్రీ బ్రౌగ‌ర్ కన్నుమూత

Published : Dec 13, 2023, 03:02 PM IST
హాలీవుడ్ లో విషాదం, స్టార్ యాక్టర్ ఆండ్రీ బ్రౌగ‌ర్  కన్నుమూత

సారాంశం

ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు ముంచెత్తుతున్నాయి. మన టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లో కూడా వరుసగా తారలు నేల రాలుతున్నారు. తాజాగా హాలీవుడ్ స్టార్ ఆండ్రీ బ్రౌగర్ కన్నుమూశారు.   

వరుస మరణాలు ఫిల్మ్ ఇండస్ట్రీని విషాదంలో నింపుతున్నాయి. 2023 లో టాలీవుడ్ నుంచి ఎంతో మంది తారలు కన్నుమూశారు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా వరుస విషాదాలు జరిగాయి. ఇక హాలీవుడ్ లో కూడా ప్రముఖ తారలు కన్నుమూయడం జరిగింది. ఇక తాజగా హాలీవుడ్ స్టార్ ఒకరు కన్ను మూశారు. గ‌త కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న హాలీవుడ్ న‌టుడు ఆండ్రీ బ్రౌగ‌ర్  మ‌ర‌ణించారు. 

హాలీవుడ్ లో పాపులర్ అయిన ప‌లు టీవీ షోల్లో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అలరించారు  ఆండ్రీ బ్రౌగ‌ర్,  61 వయస్సులో ఆయన మరణించారు.  విశేషంగా ఆక‌ట్టుకున్నారు. బ్రౌగ‌ర్‌ భార్య  అమి బ్రాబ్స‌న్‌ కూడా పాపులర్ నటి. వీరికి  ముగ్గురు కుమారులున్నారు. ఆండ్రీ మ‌ర‌ణంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయ‌న అభిమానులు షాక్ కు గుర‌య్యారు. వరుసగా వివిధ దేశాల నుంచి సంతాపాలు ప్రకటిస్తున్నారు. బ్రౌగ‌ర్ 1962, జులై 1న చికాగోలో జ‌న్మించారు. థియేటర్ స్టూడెంట్ గా లైఫ్ స్టార్ట్ చేసి.. వెండితెరపై వెలుగొందారు. 

కామెడీ షో బ్రూక్లిన్ నైన్‌-నైన్‌లో కెప్టెన్ రేమాండ్ హాల్ట్ పాత్ర‌లో ఆండ్రీ అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. 1990ల్లో హోమిసైడ్ : లైఫ్ ఆన్ ది స్ట్రీట్‌లో డిటెక్టివ్ ఫ్రాంక్ పెంబ్లిట‌న్ పాత్ర‌తో ఆయ‌నకు ప్రాచుర్యం ల‌భించింది. కామెడీ సిరీస్‌లో ఆయ‌న‌కు రెండు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ల‌భించాయి. దీనికి తోడు ఆండ్రీ నాలుగు ఎమ్మీ నామినేష‌న్స్ కూడా స్వీరించారు.

హార్వీ వీన్‌స్టీన్ స్కాండ‌ల్‌పై న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ఆధారంగా తెర‌కెక్కిన షి సెడ్ డ్రామాలో ఇటీవ‌ల ఆయ‌న క‌నిపించారు. ఈ ప్రాజెక్టులో న్యూయార్క్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిట‌ర్ డీన్ బాక్వెట్ పాత్ర‌లో ఆయ‌న క‌నిపించారు. ఇక ఆండ్రీ బ్రౌగ‌ర్ తాను న‌టిస్తూ తెర‌కెక్కించిన ల‌వ్ సాంగ్స్ షోటైం ట్రియాల‌జీలోనూ క‌నిపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Boyapati Sreenu: చిరంజీవితో బోయపాటి సినిమా ఎందుకు చేయలేదో తెలుసా ? బాలకృష్ణ అఖండ వల్ల అంత జరిగిందా..
నా కూతురు చిన్న పిల్ల... మీరు రాసే వార్తలు చదివితే తట్టుకోగలదా? స్టార్ హీరో ఎమోషనల్