హాలీవుడ్ నటుడు మాథ్యూ పెర్రీ అనుమానాస్పద మృతి, కారణం ఏంటి..?

By Mahesh Jujjuri  |  First Published Oct 29, 2023, 11:33 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కలవరపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా హాలీవుడ్ లో ఈమధ్య ఎక్కువగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అనుమానాస్పద పరిస్థితుల్లో స్టార్స్ మరణిస్తున్నారు.తాజాగా హాలీవుడ్ స్టార్ మాథ్యూకూడా అలానే మరణించారు.   


ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కలవరపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా హాలీవుడ్ లో ఈమధ్య ఎక్కువగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అనుమానాస్పద పరిస్థితుల్లో స్టార్స్ మరణిస్తున్నారు.తాజాగా హాలీవుడ్ స్టార్ మాథ్యూకూడా అలానే మరణించారు.   
హాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.  ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా స్టార్లు మరణిస్తున్నారు. రీసెంట్ గా అమెరికన్ -కెనడియన్ హాస్యనటుడు మాథ్యూ పెర్రీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.  సిట్‌కామ్ ఫ్రెండ్స్ సిరీస్‌తో ఫేమస్ అయిన మాథ్యూ పెర్రీ 54 ఏళ్ల వయసులో మరణించారు. ఫెర్రీ మరణంతో హాలీవుడ్ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ సిట్‌కామ్ ఫ్రెండ్స్ నటుడు మాథ్యూ పెర్రీ మృతదేహం హాట్ టబ్‌లో లభ్యమైంది. 

ఫేమ్ మాథ్యూ పెర్రీ మృతి అభిమానులకు తీవ్ర దిగ్రాంతికి గురిచేసింది.  సినీ పరిశ్రమ నుంచి వరుసగా సంతాపాలు వ్యక్తం అవుతున్నాయి. మాథ్యూ 90 స్ లో ఫ్రెండ్స్ షోలో చాండ్లర్ బింగ్ పాత్రను పోషించారు.  ఈ షో ద్వారా ఆయన ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక గుర్తింపు సాధిచారు మాథ్యూ.  లాస్ ఏంజిల్స్ టైమ్స్ ప్రకారం, మాథ్యూ మృతదేహం అతని ఇంట్లో హాట్ టబ్‌లో గుర్తించారు. నీట మునిగి మాథ్యూ మృతి చెందినట్లు చెబుతున్నారు.  

Latest Videos

 

- the American Actor who played the iconic "Chandler Bing" in All-time Hit sitcom "Friends" passed away in LA at the age of 54..

Shocking..

Perry was found dead in hot tub at his home in LA Saturday local time..

For decades, he battled alcohol and substance… pic.twitter.com/yudcj1tu0n

— Ramesh Bala (@rameshlaus)

అయితే మాథ్యూ పెర్రీ మరణం అనుమనాస్పందంగా ఉండటంతో దానికి సంబంధించి వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంలో పోలీసులు క్లారిటీ ఇచ్చారు.  దాని వెనుక ఎటువంటి కుట్ర లేదని పోలీసులు చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం, మాథ్యూ పెర్రీకి మోలీ హర్విట్జ్‌ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. కానీ 6 నెలల తర్వాత వారిద్దరూ ఎంగేజ్ మెంట్ ను బ్రేకప్ చేసుకున్నారు. 

టెలివిజన్ లో చిన్న పాత్ర ద్వారా కెరీర్ ను స్టార్ట్ చేసిన మాథ్యూ.. ఆతరువాత బాయ్స్ విల్ బి బాయ్స్ తో బాగా పాపులర్ అయ్యాడు. ఈషోలో అతను నటించిన  చేజ్ రస్సెల్ పాత్ర ప్రజాదరణ పొందింది. ఈ షో 1987 నుండి 1988 వరకు భారీ టీఆర్పీతో కొనసాగింది.  గ్రోయింగ్ పెయిన్స్, సిడ్నీ వంటి షోలలో చిన్న పాత్రలు చేసి ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు మాథ్యూ. ఇక ఆయన జీవితాన్ని మార్చేసింది ఫ్రెండ్స్ షో.  1994 లో ప్రారంభమైన ఈ షో అతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. 

click me!