
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ వరల్డ్ మూవీగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ‘మహానటి’ ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భారీ చిత్రం రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రం కోసం వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది మే 9న రిలీజ్ చేసేందుకు సినిమాను షెడ్యూల్ చేశారు.
ఇక ఇప్పటికే ఈ తెలుగు చిత్రాల సత్తాపై హాలీవుడ్ డైరెక్టర్లు స్పందిస్తున్న విషయం తెలిసిందే. 2022లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’పై హాలీవుడ్ దర్శకులు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. RRRపై క్రిస్టోఫర్ నోలన్ వంటి ప్రముఖ దర్శకుడు స్పందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన తమ్ముడు జోనాథన్ నోలన్ (Jonathan Nolan) టాలీవుడ్ లో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై స్పందించారు.
ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. దాని ప్రకారం.. ఇండియన్ సినిమాల్లో లోకేషన్స్, స్టంట్స్ అద్భుతంగా ఉంటున్నాయని అన్నారు. సైన్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’ మేకర్స్ మాత్రం ప్రాక్టికల్ గా వర్క్ చేస్తున్నారు. మేకర్స్ ఎవరి సలహా తీసుకునే స్థాయిలో లేరు. మంచి సినిమాను అందించబోతున్నారని ఆశిస్తున్నారు. ఇండియన్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు గొప్పగా సినిమాలు చేస్తున్నారని, ప్రతి సన్నివేశాన్ని అర్థవంతంగా చూపిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొణె (Deepika Padukone), దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.