ఫ్యామిలీ స్టార్ ప్లాప్, దారుణమైన ట్రోల్స్... విజయ్ దేవరకొండ సైలెన్స్ కి కారణం!

Published : Apr 09, 2024, 01:47 PM IST
ఫ్యామిలీ స్టార్ ప్లాప్, దారుణమైన ట్రోల్స్... విజయ్ దేవరకొండ సైలెన్స్ కి కారణం!

సారాంశం

విజయ్ దేవరకొండను ఆడేసుకుంటున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ మాత్రం సైలెంట్ అయిపోయాడు. పాపం దిల్ రాజు మూవీని స్వయంగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. నిజానికి తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారికి కౌంటర్ ఇస్తాడు.

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. విజయ్ దేవరకొండను దారుణంగా ట్రోల్ చేస్తుండగా ఆయన సైలెంట్ అయిపోయాడు. దర్శకుడు పరశురామ్ కెరీర్లో గీత గోవిందం బిగ్గెస్ట్ హిట్. ఈ చిత్రంలో హీరో హీరోయిన్ గా నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందాన స్టార్స్ అయ్యారు. వారికి భారీ ఫాలోయింగ్ తెచ్చి పెట్టిన చిత్రం అది. పరశురామ్ తో విజయ్ దేవరకొండ చేసిన రెండో చిత్రం ఫ్యామిలీ స్టార్. 

ఫ్యామిలీ స్టార్ చిత్తాన్ని ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. విజయ్ కి జంటగా మృణాల్ ఠాకూర్ నటించింది. ట్రైలర్ ఆకట్టుకోగా ఫ్యామిలీ స్టార్ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి. చాలా కాలంగా హిట్ లేక అల్లాడుతున్న విజయ్ దేవరకొండ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. తీరా చూస్తేఫస్ట్ షో నుండే ఫ్యామిలీ స్టార్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు పరశురామ్ కథ, కథనాలు లేకుండా రొటీన్ స్టోరీతో ఒక సీరియల్ తీశాడని అంటున్నారు. ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ సినిమాకు ఇంత దారుణమైన టాక్ రాలేదు. 

ఈ క్రమంలో విజయ్ దేవరకొండను ఆడేసుకుంటున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ మాత్రం సైలెంట్ అయిపోయాడు. పాపం దిల్ రాజు మూవీని స్వయంగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. నిజానికి తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారికి కౌంటర్ ఇస్తాడు. ట్రోల్స్ పై స్పందించకుండా. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ చేయకుండా... మౌనం వహిస్తున్నాడు. కనీసం సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం లేదు. రౌడీ హీరో మౌనం వెనుక కారణమ్ తెలియరాలేదు.

PREV
click me!

Recommended Stories

Ram Charan ‌Daughter Klin Kaara: రామ్ చరణ్ ను నాన్న అనుకుండా..క్లీంకార ఏమని పిలుస్తుందో తెలుసా? మెగా పవర్ స్టార్ చెప్పిన సీక్రెట్..
Illu Illalu Pillalu Today Episode: ధీరజ్‌ను మోసం చేయబోయిన భద్రావతి.. చివరి నిమిషంలో అడ్డుకున్న రామరాజు