
డిస్నీ - మార్వెల్ స్టూడియోస్ (Disney Marvel Studios) సంయుక్తంగా నిర్మించే అవెంజర్స్ తదితర సూపర్ హీరో సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సూపర్ హీరో సినిమాల సిరీసుల్లో ఐరన్ మాన్ (Iron Man) సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఐరన్ మాన్ మూవీ సిరీస్ తో పాటు అవెంజర్స్ (Avengers) మూవీ సిరీస్ లోనూ ఐరన్ మాన్ కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ లో ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ కూడా ముగిసిపోతుంది. ఈ సందర్భంగా అవెంజర్స్ ఎండ్ గేమ్ తరువాత వచ్చిన మార్వెల్ సూపర్ హీరో సినిమాల్లో ఐరన్ మ్యాన్ తిరిగివస్తాడనే ఊహాగానాలు వినిపిస్తూ వస్తున్నాయి.
వాటికి మరింత ఊతం ఇచ్చే రీతిన మార్వెల్ స్టూడియోస్ వారి నుంచి వస్తున్న ‘డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ చిత్రంలో ఐరన్ మాన్ తిరిగి వస్తున్నాడని తెలిసింది. ఈ పాత్రను ప్రముఖ ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ పోషిస్తున్నారనే ప్రచారంలో జరుగుతోంది. తాజాగా విడుదలైన డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మే 6న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అప్పటికే హాలీవుడ్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. ఈ ముక్యంగా స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ పాత్రలకు ఎంతో మంది వీరాభిమానులున్నారు. వాటి ఆధారంగా తెలుగుతో పాటు హిందీ ఇతర భాషల్లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఈ కోవలో ఐరన్ మ్యాన్ కూడా చేరింది. అయితే హాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరుపొందిన టామ్ క్రూజ్ ఐరన్ మ్యాన్ అవతారం ఎత్తనుండటం ఆసక్తికరమైన విషయం. ఇప్పటికే ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ లతో టామ్ క్రూజ్ తన యాక్షన్ తడాఖా చూపిస్తున్నారు. ప్రస్తుతం ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలె చిత్రీకరణ పూర్తి చేసుకుంది.