యూఎస్ఏలో ‘హిట్ 2’ సాలిడ్ కలెక్షన్స్.. రెండ్రోజుల్లోనే ఇంత కలెక్ట్ చేసిందా?

Published : Dec 04, 2022, 04:22 PM IST
యూఎస్ఏలో ‘హిట్ 2’ సాలిడ్ కలెక్షన్స్.. రెండ్రోజుల్లోనే ఇంత కలెక్ట్ చేసిందా?

సారాంశం

‘హిట్ 2’తో టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) మరో బ్లాక్ బాస్టర్ ను అందుకున్నారు. రెండ్రోజుల కింద ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూఎస్ఏలో సాలిడ్ కలెక్షన్స్ ను రాబుతోంది.   

‘మేజర్’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో అడివి శేష్  తాజాగా ‘హిట్ 2’తో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పటి నుంచో ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్న ఆడియెన్స్ అంచనాలను రీచ్ అయ్యారు. తొలిరోజే ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు యూఎస్ఏలోనూ అదిరిపోయే టాక్ ను దక్కించుకుంది. సినిమాలోని ట్విస్టులు, ఇంటర్ లింక్, నెక్ట్స్ సిరీస్ కు క్లూ ఇచ్చిన తీరు అద్బుతంగా ఉండటం విశేషం. 

మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా ‘హిట్ 2’ దుమ్ములేపుతోంది.  అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. 1000పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం తొలిరోజూ మంచి ఓపెన్సింగ్ ను దక్కించుకుంది. రూ.11.6 కోట్ల గ్రాస్ ను దక్కించుకుంది. రెండో రోజు రూ.7.75 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. మరోవైపు యూఎస్ లోనూ దుమ్ములేపుతోంది. థియేటర్లలోకి వచ్చన రెండ్రోజులకే మైల్ స్టోన్ ను రీచ్ అయ్యింది. ఇప్పటి వరకు 1 మిలియన్ డాలర్ ను కలెక్ట్ చేసింది. తక్కువ సయమంలో ఇంత వసూల్ చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. 

ఇక ఈ మూవీ మిగిలినవి అన్ని కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది.  ఈ మొత్తం షేర్ కింద వస్తే పూర్తి రికవరీ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం మొత్తం 19.7 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. సినిమాతో పాజిటివ్ టాక్ దక్కడంతో లాంగ్ రన్ లో థియేటర్లలో సందడి చేయనుంది. బాక్సాఫీస్ వద్ధ మరింతగా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టనుంది.ఈ మూవీలో అడవి శేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించారు. భానుచందర్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, కోమలి ప్రసాద్, మాగంటి శ్రీనాథ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్