#hit2: అప్పుడు `దిశా`.. ఇప్పుడు `శ్రద్ద`.. షాకిచ్చిన `హిట్‌ 2` డైరెక్టర్‌

Published : Nov 28, 2022, 04:55 PM IST
#hit2: అప్పుడు `దిశా`.. ఇప్పుడు `శ్రద్ద`.. షాకిచ్చిన `హిట్‌ 2` డైరెక్టర్‌

సారాంశం

`హిట్2`  సినిమా  వచ్చే శుక్రవారం విడుదల కాబోతుంది.  రిలీజ్‌కి ముందు అలాంటి మర్డర్‌ రియల్‌గా జరగడం విచారకరం. 

మర్డర్‌ మిస్టరీల నేపథ్యంలో తెలుగులో ఓ సిరీస్‌ చేస్తున్నారు యంగ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ కొలను. `హిట్‌`(Hit) సినిమాతో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు `హిట్‌ 2`(Hit2)తో రాబోతున్నారు. దీన్ని ఒక సిరీస్‌గా ఏకంగా ఏడు సినిమాలను ప్లాన్‌ చేశారు. సిరియల్‌ కిల్లర్‌ తరహాలో `హిట్‌` సిరీస్‌ని తీసుకురాబోతున్నారు. ఇందులో ఒక్కో సిరీస్‌కి ఒక్కో హీరోని తీసుకోబోతున్నారు. ప్రస్తుతం అడవిశేషు హీరోగా రూపొందిన `హిట్‌ 2` డిసెంబర్‌ 2న విడుదల కాబోతుంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల టైమ్‌లోనే ఢిల్లీలో ఇలాంటి మర్డర్‌ రియల్‌గా జరగడం విచారకరం. `హిట్‌ 2`లో సీరియల్‌ కిల్లర్‌ వరుస హత్యలు చేస్తూ వేర్వేరు బాడీల పార్ట్ లను ఒకటిగా చేస్తూ వెళ్తుంటారు. దాన్ని హీరో ఎలా ఛేదించాడనేది కథ. అయితే మొన్న ఢిల్లీలో శ్రద్ధ హత్య(Delhi Murder Case) కేసు కూడా ఇంచు మించుగా ఇలానే జరగడం బాధాకరం. నింధితుడు శ్రద్దని 35 భాగాలుగా చేసి రోజుకో భాగాన్ని బయట పడేసి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. మర్డర్‌ కేసులోనే ఇదొక సెన్సేషనల్‌ కేసుగా నిలిచింది. 

అయితే హిట్‌ 2 రిలీజ్‌ టైమ్‌లోనే దానిపై చర్చ జరుగుతుండటం పరోక్షంగా సినిమాపై అటెన్షన్‌ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. తాజాగా దర్శకుడు శైలేష్‌ కొలను స్వయంగా వెల్లడించారు. `హిట్‌` సినిమా రిలీజ్‌ టైమ్‌లో శంషాబాద్‌ సమీపంలో `దిశా` మర్డర్‌ జరిగిన విషయం తెలిసిందే. అది కూడా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటికే శైలైష్‌.. విశ్వక్‌ సేన్‌తో `హిట్‌` సినిమా తీసేశాడు. ఆ మర్డర్‌ వార్త విని తాను షాక్‌ అయ్యానని తెలిపాడు. తన సినిమా కథ ఎలా రాసుకుని తీశానో, ఆల్మోస్ట్ అలానే `దిశా` ఘటన చోటు చేసుకోవడంతో షాక్‌ అయ్యానని కోలుకోవడానికి టైమ్‌ పట్టిందన్నారు. ఇప్పుడు `హిట్‌ 2` రిలీజ్‌ టైమ్‌లో శ్రద్ధ ఘటన చోటు చేసుకుందన్నారు. తన విచారం వ్యక్తం చేశారు శైలేష్‌ కొలను. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?