‘మహర్షి’ కూడా మొదలెట్టేసాడు, కలెక్టర్స్ పర్మిషన్స్

By AN TeluguFirst Published Apr 25, 2019, 4:29 PM IST
Highlights

పెద్ద సినిమా వస్తోందంటే టిక్కెట్ రేట్లు రెట్టింపు అవటం జరుగుతూంటుంది. 

పెద్ద సినిమా వస్తోందంటే టిక్కెట్ రేట్లు రెట్టింపు అవటం జరుగుతూంటుంది. భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలకు టిక్కెట్ పెంచుకునే ఈ వెసులుబాటు చట్ట పరంగా ఉండటంతో ఎవరూ ఏమీ అనలేని పరిస్దితి. దాంతో పెద్ద సినిమా రిలీజ్ ముందు డిస్ట్రిబ్యూటర్స్   కలెక్టర్ నుంచి పర్మిషన్ తెచ్చుకునేందుకు లెటర్స్ పెడుతూంటారు. తాజాగా మహేష్ హీరోగా రూపొందిన మహర్షి చిత్రం టిక్కెట్ల పెరుగుదల కోసం వివిధ ప్రాంతాల పంపిణీదారులు అదే పనిలో ఉన్నారు.

మొదటివారం టిక్కెట్ రేట్లు పెంచుకుంటామంటూ కలెక్టర్స్ ని ఎప్రోచ్ అవుతున్నారు. కర్నూల్ సిటీలో మహర్షి టిక్కెట్ రేట్లు పెంచమని కోరుతూ పెట్టుకున్న ఫర్మిషన్ లెటర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్  క్లాస్ 250, సెకండ్ క్లాస్ 150, ధర్డ్ క్లాస్ 100 పెంచమని కోరారు. అంటే దాదాపు నలభై శాతం పెంచమని కోరారన్నమాట. మహేష్ కు మాస్ , క్లాస్ లలో ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అనుసరిస్తున్న వ్యూహం ఇదన్నమాట. 

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా, సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పివిపి సినిమా నిర్మిస్తున్న ప్రెస్టీజియస్‌ మూవీ ‘మహర్షి’.ఈ చిత్రంలో మహేష్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. కామెడీ కింగ్‌, హీరో అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ బాణీలు కడుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. పైగా ఇది మహేష్  కెరీర్‌లో 25వ సినిమా కావడంతో ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటాయి. చిత్రాన్ని మే 9వ తేదీన విడుదల చేస్తున్నారు.

click me!