Taapsee: ప్యాంటు లేకుండా పబ్లిక్ లో ఆ ఫోజేంటి తాప్సీ..!

Published : Feb 26, 2023, 05:33 PM IST
Taapsee: ప్యాంటు లేకుండా పబ్లిక్ లో ఆ ఫోజేంటి తాప్సీ..!

సారాంశం

హీరోయిన్ తాప్సి ఒక షాకింగ్ ఫోటో షేర్ చేసింది. తన ఫ్రెండ్ ని హగ్ చేసుకుంటూ ఇచ్చిన ఆ ఫోజ్ ట్రోల్స్ కి గురవుతుంది. 

తాప్సి ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. ఆమె షేర్ చేసిన ఫోటో చూసేందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ట్రెండీ దుస్తుల్లో పక్కన ఉన్న ఫ్రెండ్ పై కాళ్లు పెట్టి హగ్ చేసుకుంది. తాప్సి డ్రెస్ బాగా పొట్టిగా ఉన్న నేపథ్యంలో నెటిజెన్స్ ట్రోల్స్ కి పాల్పడుతున్నారు. 'ట్రీ అండ్ మంకీ' అంటూ సదరు ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. తన ఫ్రెండ్ ను చెట్టుగా తనని కోతిగా ఆమె వర్ణించారు. తాప్సి ఫోటో చూసిన నెటిజెన్స్ ఇదేం ఫోజు అంటూ ట్రోల్ చేస్తున్నారు. పబ్లిక్ ఫ్లాట్ ఫార్మ్ లో ఈ తరహా ఫోటో షేర్ చేయడం అవసరమా అంటున్నారు. 

ఎంత అమ్మాయితో అయితే మాత్రం అంత దారుణమైన ఫోజు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి నెటిజన్ల ట్రోల్స్ పై తాప్సి స్పందిస్తుందో లేదో చూడాలి. ఓ వర్గం మాత్రం ఫోటోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు . అద్భుతంగా ఉందంటూ కితాబు ఇస్తున్నారు. తాప్సి ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. విమర్శలతో పాటు లైక్స్ కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. పలువురు సెలెబ్రిటీలు ఆ ఫోటోపై స్పందించడం విశేషం. 

డేరింగ్ డాషింగ్ హీరోయిన్స్ లో తాప్సి ఒకరు. ఈ బోల్డ్ బ్యూటీ హిందీలో వరుస చిత్రాలు చేస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. తనకంటూ ఒక ఇమేజ్, జానర్ సెట్ చేసుకొని సత్తా చాటుతున్నారు. ఆమె ప్రధాన పాత్ర చేసిన బద్లా సూపర్ హిట్ కొట్టింది. అమితాబ్ మరో ప్రధాన పాత్ర చేయగా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అలాగే గేమ్ ఓవర్ సైతం తెలుగు, తమిళ భాషల్లో ఆదరణ దక్కించుకుంది. రష్మీ రాకెట్, సాంద్ కి ఆంక్, శభాష్ మిథు వంటి స్పోర్ట్స్ డ్రామాలు చేశారు. పాత్ర కోసం శరీరాన్ని కష్టపెట్టే హీరోయిన్స్ లో తాప్సి ఒకరు. 

కాగా తాప్సి కెరీర్ మొదలైంది తెలుగులోనే. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఝుమ్మందినాదం చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటించారు. తర్వాత పలువురు హీరోలతో జతకట్టారు. రవితేజ, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ సరసన నటించారు. గత ఏడాది తాప్సి నటించిన మిషన్ ఇంపాజిబుల్ తెలుగులో విడుదలైంది. కొన్నాళ్లుగా ఆమె హిందీలో ఎక్కువగా చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం జనగణమన, ఏలియన్ అనే తమిళ చిత్రాలు చేస్తున్నారు. లడ్కి హై కహా?,డన్కి, ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా వంటి హిందీ చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలు చేస్తున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?