Latest Videos

వయసులో తనకంటే చిన్నోడితో పెళ్ళికి సిద్ధమైన హీరోయిన్!

By Sambi ReddyFirst Published Jun 11, 2024, 8:49 AM IST
Highlights

స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్ళికి సిద్ధమైంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి పీటలు ఎక్కనుంది. అయితే పెళ్లి కొడుకు వయసులో సోనాక్షి సిన్హా కంటే చిన్నోడు కావడం విశేషం. 
 

బాలీవుడ్ భామలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అలియా భట్, కియారా అద్వానీ, పరిణితి చోప్రా గత రెండేళ్లలో వివాహ బంధంలో అడుగుపెట్టారు. మరో స్టార్ హీరోయిన్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనుంది. ఆమె ఎవరో కాదు సోనాక్షి సిన్హా. నటుడు శత్రుజ్ఞ సిన్హా కూతురైన సోనాక్షి సిన్హా దబంగ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. 2010లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. సోనాక్షి సిన్హాకు వరుస ఆఫర్స్ వచ్చాయి. 

అయితే ఆమె స్టార్ కాలేకపోయింది.ప్రస్తుతం అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. కొన్నాళ్ళుగా ఆమె నటుడు జహీర్ ఇక్బాల్ తో డేటింగ్ చేస్తుంది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటున్నారు. సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ జూన్ 23న వివాహం చేసుకుంటున్నట్లు సమాచారం. పెళ్ళికి ఏర్పాట్లు ముమ్మరంగా నడుస్తున్నాయట. 

విశేషం ఏమిటంటే సోనాక్షి సిన్హా వయసు 37 ఏళ్ళు కాగా.. జహీర్ ఇక్బాల్ ఏజ్ 35 ఏళ్ళు మాత్రమే. వయసులో తనకంటే రెండేళ్లు చిన్నవాడిని సోనాక్షి వివాహం చేసుకోవడం విశేషం. అయితే బాలీవుడ్ లో ఇదేమి కొత్త కాదు. ప్రియాంక చోప్రా తన కంటే 10 ఏళ్ళు చిన్నవాడైన నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకుంది. అలాగే నమ్రత శిరోద్కర్ కంటే మహేష్ బాబు దాదాపు ఐదేళ్లు చిన్నవాడు కావడం కొసమెరుపు. 

ఇక సోనాక్షి సిన్హా నటించిన వెబ్ సిరీస్ హీరామండి హిట్ టాక్ సొతం చేసుకుంది. నెట్ఫ్లిక్స్ లో మే 1 నుండి స్ట్రీమ్ అవుతుంది. సోనాక్షి సిన్హాతో పాటు మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరి ప్రధాన పాత్రలు చేశారు. ప్రస్తుతం రెండు సినిమాల్లో సోనాక్షి సిన్హా నటిస్తుంది. 
 

click me!