త్వరలో పెళ్లి పీటలెక్కనున్న శ్రియ.. వరుడి వివరాలు

Published : Feb 07, 2018, 09:51 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న శ్రియ.. వరుడి వివరాలు

సారాంశం

దక్షిణాదిలో దశాబ్దంపైగా టాప్ హిరోయిన్ గా శ్రియ యంగ్ హీరోయిన్లతో పోటీపడి నటిస్తున్న శ్రియ గాయత్రి సినిమాతో వస్తోన్న శ్రియకు పెళ్లి ముహూర్తం ఫిక్స్!

సౌత్ సినిమాల్లో నటిస్తూ దశాబ్దంపైగా దక్షిణాది పరిశ్రమలను ఏలుతున్న శ్రియ త్వరలో పెళ్లి పీటలెక్కనుందట. ఓ రష్యన్ యువకుడితో ఆమె సన్నిహితంగా ఉంటోందని, త్వరలోనే అతణ్ని వివాహం చేసుకోనుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి విషయంపై అబ్బాయి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు శ్రియ రష్యా వెళ్లిందనీ, అన్నీ కుదిరితే వచ్చే నెలలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయని ‘ముంబై మిర్రర్’ వార్తా కథనం ప్రచురించింది.

 

చాలా మంది వస్తుంటారు, పోతుంటారు.. నేను లోకల్ అంటూ యంగ్ హీరోయిన్స్ కు సైతం గట్టి పోటీనిస్తూ.. 35 ఏళ్ల వయసులోనూ ఈ భామ కెరీర్‌‌లో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు సంపాదించుకున్న శ్రియ మార్చిలో పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లో శ్రియ పెళ్లికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని కొంత మంది చెవులు కొరుక్కుంటున్నారు. శ్రియ తన పెళ్లి గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌