
ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన సాయి పల్లవి మ్యానియాతో టాలీవుడ్ షేక్ అవుతున్న నేపధ్యంలో... ఆమెను తమ సినిమాలలో బుక్ చేసుకోవాలని ఎందరో దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఒక్క ఫిదా సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయిన ఈ పింపుల్స్ హీరోయిన్ గురించి ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది.
ఫిదా సినిమాకు సాయి పల్లవి ప్రాణంగా నిలిచిన నేపధ్యంలో నిర్మాతలు అంతా ఆమె వెంట పడుతూ ఉంటే... తను మాత్రం ఎవరికీ డేట్స్ ఇవ్వకుండా దిల్ రాజు సంస్థ... శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ లో వరుసగా మూడు సినిమాల్లో పని చేసేందుకు సిగ్నల్ ఇచ్చేసిందట. దీనిపై ఆమెను చాలామంది నిర్మాతలు ఎందుకలా..అని ప్రశ్నించడంతో తనకు దిల్ రాజు గాడ్ ఫాదర్ అని చెపుతున్నట్లు సమాచారం.
సాయి పల్లవి వరసగా చేయబోయే ఈ మూడు సినిమాలలో ఒకటి నాని సరసన 'ఎంసిఏ' కాగా మరో రెండు సినిమాలు ఏమిటి అన్న విషయం పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సాయి పల్లవి డేట్స్ తన వద్ద ఉన్నాయి కాబట్టి ఆ డేట్స్ తో కొంతమంది టాప్ హీరోలను లైన్లో పెట్టాలన్నది దిల్ రాజు ప్లాన్ గా తెలుస్తోంది. ‘ఫిదా’ విడుదల కాకుండానే సాయి పల్లవిని తన భవిష్యత్ మూడు సినిమాల ఎగ్రిమెంట్ లో కార్నర్ చేసాడు దిల్ రాజు. అంటే దిల్ రాజు బిజినెస్ లో ఏ రేంజ్ తెలివితేటలు కనబరుస్తారో అర్ధం అవుతుంది.