ఫేక్ వీడియోపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అమీర్ ఖాన్

By Surya PrakashFirst Published Apr 16, 2024, 8:32 PM IST
Highlights

దీనిపైన ముంబై పోలీసుల సైబర్ క్రైమ్ సెల్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు ఖాన్ పేర్కొన్నారు.  అమీర్ ఖాన్ అధికారిక ప్రతినిధి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 

ఫేక్ వీడియో బారిన అమీర్ ఖాన్ పడ్డారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రాబోయే రోజుల్లో లోక్ సభ ఎన్నికలలో కాంగ్రేస్ కు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపై ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై అమీర్ ఖాన్ స్పందించారు. 
 
 అది నకిలీ వీడియో అని, ఏ ఒక్క రాజకీయ పార్టీతో తన సంబంధం లేదని, ఏ పార్టీకి ప్రమోట్ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.ఏ ఒక్క రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని, ఏ పార్టీని తాను ప్రమోట్ చేయలేదని స్పష్టం చేశారు. నా 35 సంవత్సరాల కెరీర్‌లో ఏ రాజకీయ పార్టీని ఎన్నడూ ఆమోదించలేదని పేర్కొన్నారు. ఎన్నికలలో.. ఎన్నికల సంఘం కోసం ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేసినట్లు వివరించారు.

 మిస్టర్ ఖాన్ ఒకే పార్టీని ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలు నకిలీవని ప్రకటించారు. దీనిపైన ముంబై పోలీసుల సైబర్ క్రైమ్ సెల్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు ఖాన్ పేర్కొన్నారు.  అమీర్ ఖాన్ అధికారిక ప్రతినిధి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 

''అమీర్‌ఖాన్‌ ఒక పార్టీని ప్రమోట్ చేస్తున్నట్టు వచ్చిన వీడియో చూసి మేము అప్రమత్తమయ్యాం. అది పూర్తిగా అవాస్తవాలతో కూడిన నకిలీ వీడియో. ముంబై పోలీస్ సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు చేశాం. ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయులంతా బయటకు వచ్చి ఎన్నికల్లో ఓటు వేయాలని, ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని మాత్రమే అమీర్‌ఖాన్ కోరుతున్నారు'' అని ఆయన తరఫు ప్రతినిధి తెలిపారు. సోషల్ మీడియోలో వైరల్ అయిన వీడియో ఆర్డిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించినట్టు అనుమానిస్తున్నారు.

click me!