రష్మిక మందాన ఫ్యామిలీని చూశారా? సిస్టర్ ఎంత క్యూట్ గా ఉందో!

By Sambi ReddyFirst Published Oct 4, 2022, 2:14 PM IST
Highlights

రష్మిక మందాన లేటెస్ట్ మూవీ గుడ్ బై. ఈ చిత్ర ప్రమోషన్స్ లో రష్మిక పాల్గొంటారు. దీనిలో భాగంగా తన రియల్ ఫ్యామిలీ మెంబర్స్ ని పరిచయం చేసింది.

రష్మిక ఫస్ట్ బాలీవుడ్ మూవీ గుడ్ బై. అక్టోబర్ 7న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్ మరో ప్రధాన పాత్ర చేశారు. వికాస్ బాల్ దర్శకత్వంలో కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు సమాచారం. ఈ చిత్ర ప్రమోషన్స్ లో రష్మిక విరివిగా పాల్గొంటున్నారు. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి డెబ్యూ మూవీతో మంచి విజయం నమోదు చేయాలని చూస్తున్నారు. 

ఇక చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మందాన తన రియల్ ఫ్యామిలీని పరిచయం చేసింది. అమ్మానాన్నలు, సిస్టర్ తో కలిసి దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. రష్మిక మందాన ఫ్యామిలీ ఫోటో ముచ్చటగా ఉంది. రష్మిక తల్లి పేరు సుమన్ మందాన కాగా తండ్రి పేరు మదన్ మందాన. ఇక రష్మిక చిన్న సిస్టర్ ఉంది. ఆమె పేరు షిమ్మన్ మందాన. ప్రస్తుతం షిమ్మన్ టీనేజ్ లో ఉన్నారు. ఫ్యామిలీ ఫొటోలో షిమ్మన్ చాలా క్యూట్ గా ఉన్నారు. 

ఇది నా రియల్ ఫ్యామిలీ త్వరలో రీల్ ఫ్యామిలీని పరిచయం చేశానని రష్మిక కామెంట్ చేశారు. అలాగే తన ఫ్రెండ్స్ వర్ష బొల్లమ్మతో పాటు మరో ఇద్దరిని నామినేట్ చేశారు. వారు కూడా తమ ఫ్యామిలీ ఫోటోలు పోస్ట్ చేయాలంటూ ఛాలెంజ్ విసిరారు. కాగా రష్మిక గుడ్ బై చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. 

మరోవైపు రష్మిక చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. విజయ్ కి జంటగా రష్మిక వారసుడు చిత్రం చేస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. పుష్ప 2 మూవీలో రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో మిషన్ మజ్ను, యానిమల్ చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. రష్మిక కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది.  
 

click me!