
చిత్ర పరిశ్రమల మధ్య ఉన్న బేరియర్స్ తొలగిపోయాయి. పాన్ ఇండియా కాన్సెప్ట్ ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో రీజనల్ భాషల్లో తెరకెక్కుతున్న పలు చిత్రాలు అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేస్తున్నారు. చివరికి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఐదు భాషల్లో అందుబాటులోకి తెస్తున్నారు. నిశ్శబ్దం, యశోద పాన్ ఇండియా చిత్రాలుగా విడుదలైన విషయం తెలిసిందే. నేషనల్ వైడ్ గుర్తింపు ఉన్న సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం సైతం పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. డ్రీం వారియర్ బ్యానర్లో ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు.
కాగా సమంత మాదిరి రష్మిక ఇండియా వైడ్ ఫేమ్ కలిగి ఉన్నారు. బాలీవుడ్ కూడా చిత్రాలు చేస్తూ నార్త్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు రష్మిక. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో పాన్ ఇండియా చిత్రం ప్రకటించారు. రైన్ బో టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. శాంతరూబన్ దర్శకత్వంలో రైన్ బో తెరకెక్కుతుంది. ఫిక్షనల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మికకు జంటగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు.
నేడు పూజా కార్యక్రమాలతో రైన్ బో ప్రారంభం అయ్యింది. ఏప్రిల్ 7వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గతంలో సమంతతో ప్రకటించారు. కారణం తెలియదు కానీ డిలే అయ్యింది. సడన్ గా రష్మిక పేరు తెరపైకి వచ్చింది. సమంతకు షాక్ ఇస్తూ ఈ ప్రాజెక్ట్ రష్మిక దక్కించుకుంది. సమంతను కాదని రష్మికతో చేయడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ కి జంటగా పుష్ప 2 చేస్తున్నారు. అలాగే రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న యానిమల్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. నితిన్ తో ఓ ప్రాజెక్ట్ ప్రకటించిన రష్మిక, కొత్తగా రైన్ బో మూవీ చేస్తున్నట్లు వెల్లడించారు.