ఊసరవెల్లి తర్వాత ఇదే తొలిసారి.. ఎన్టీఆర్ లుక్ లో క్రేజీ సీక్రెట్, ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటారా..

Published : Apr 03, 2023, 11:39 AM IST
ఊసరవెల్లి తర్వాత ఇదే తొలిసారి.. ఎన్టీఆర్ లుక్ లో క్రేజీ సీక్రెట్, ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటారా..

సారాంశం

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం 2018 అక్టోబర్ లో విడుదలయింది. ఇప్పటికి నాలుగున్నర ఏళ్ళు గడుస్తోంది. ఇన్నేళ్ళలో ఎన్టీఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మాత్రమే వచ్చింది.

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం 2018 అక్టోబర్ లో విడుదలయింది. ఇప్పటికి నాలుగున్నర ఏళ్ళు గడుస్తోంది. ఇన్నేళ్ళలో ఎన్టీఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మాత్రమే వచ్చింది. మరో కొత్త చిత్రం కూడా ప్రారంభం కాలేదు. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకి తారక్.. కొరటాల శివ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. 

రీసెంట్ గా ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ షూటింగ్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ షూటింగ్ కి వెళుతున్న దృశ్యాలని చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఎన్టీఆర్ బ్యాక్ లుక్ ని మాత్రమే వీడియోలో చూపించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. తన కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా ఎన్టీఆర్ 30 ని తీర్చి దిద్దుతా అని కొరటాల శివ ప్రామిస్ కూడా చేశారు. 

దీనితో ఫ్యాన్స్ ఈ చిత్రంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ షూటింగ్ కి వెళుతున్న వీడియోలో బ్యాక్ లుక్ చూపించారు. అది కూడా షాడోలో మాత్రమే తారక్ కనిపిస్తారు. అయినప్పటికీ ఎన్టీఆర్ లుక్ లో ఒక క్రేజీ సీక్రెట్ ని తారక్ ఫ్యాన్స్ పసిగట్టారు. 

ఈ వీడియోలో ఎన్టీఆర్ చెవి పోగులతో కనిపిస్తున్నారు. బృందావనం, ఊసరవెల్లి తర్వాత ఎన్టీఆర్ ఇలా పూర్తి స్థాయిలో చెవిపోగులతో కనిపించడం ఇదే తొలిసారి. బృందావనం, ఊసరవెల్లి చిత్రాల్లో ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో చెవిపోగులతో కనిపించారు. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో కూడా చెవిపోగు ఉన్నపటికీ అది కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయ్యేది. ఊసరవెళ్లి తర్వాత చెవిపోగు లుక్ కి ఎన్టీఆర్ గ్యాప్ ఇచ్చారు. 

ఇప్పుడు కొరటాల శివ చిత్రం కోసం మరోసారి తారక్ చెవిపోగులతో కనిపించబోతున్నాడు అనేది స్పష్టం అయింది. ఈ సంగతి తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైలెంట్ గా ఎందుకు ఉంటారు. మా అభిమాన హీరో మరోసారి చెవిపోగు పెట్టాడు అంటూ ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సౌత్ లో ఆమెకి ఇదే డెబ్యూ మూవీ.గుర్తింపు నోచుకోని ఓ సముద్ర తీరప్రాంతంలో మృగాల్లాంటి వ్యక్తులు అరాచకం సృష్టిస్తుంటే వారిని రక్షించే వీరుడిగా ఎన్టీఆర్ ఆ ప్రాంతానికి వెళతారు. ఈ ఆసక్తికర పాయింట్ తో కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువసుధ సంస్థతో కలసి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ