
సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుంది హీరోయిన్ ప్రియమణి. ఇటు వెండితెరపై.. అటు ఓటీటీలలో వరుసగా దుమ్మురేపుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ఇంతకు ముందుకంటే కూడా ఇప్పుడు బిజీగా ఉంటుంది. అంతేకాదు రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది సీనియర్ బ్యూటీ. లాస్ట్ ఇయర్ జవాన్ సినిమాతో బాలీవుడ్ లో భారీ హిట్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు ఓటీటీలో కూడా సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ లు తో ఆడియన్స్ ను అలరిస్తోంది ప్రియమణి. తాజాగా ఆమె భామా కలాపం 2 వెబ్ సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు ఈ భామ కీలకపాత్ర పోషించిన ఆర్టికల్ 370 మూవీ కూడా ప్రియమణి సక్సెస్ లిస్ట్ లో పడిపోయింది.
ఇలా వరుసగా సినిమాలు చేస్తూ.. విజయాలు సాధిస్తూ.. చేతినిండా సినిమాల, బ్యాగ్ నిండా రెమ్యునరేషన్ తో దూసుకుపోతున్న ప్రియమణి.. తాజాగా ఓ కాస్ల్లీ కారు కొన్నారు. జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ ని కొనుగోలు చేసింది ప్రియమణి. ఈ కారు ధర దాదాపు 74 లక్షల వరకు ఉంది. అయితే కాస్ట్లీ కార్లు ప్రియమణికి కొత్తేమి కాదు. ఇప్పటికే ఆమె గ్యారేజ్ లో బొలెడు కాస్ట్ లీ కార్లు ఉన్నాయట. ఇక ఇ్పపుడు అందులో మరో ఖరీదైన లగ్జరీ కారు వచ్చి చేరింది అంతే.
హీరోయిన్ గా కెరీర్ కు పుల్ స్టార్ పెట్టి.. కొంత కాల ప్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేసింద ప్రియమణి. ఆతరువాత ఫ్యామిలీ వెబ్ సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రియమణి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత తెలుగులో భామా కలాపం సిరీస్ ద్వారా మరోసారి సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో సత్తా చాటుతుంది.ముందు ముందు ఇంకా బిజీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఇక ఈమధ్యలో టీవీషోలతో కూడా సందడి చేసింది సీనియర్ బ్యూటీ.
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఎవరే అతగాడు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచియం అయ్యింది మలయాళ బ్యూటీ ప్రియమణి. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్స్ అందుకుంది. అంతే కాదు యంగ్ స్టార్ తో పాటు సీనియర్ హీరోల సరసన కూడా మెరిసి.. స్టార్ డమ్ అందుకుంది బ్యూటీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన యమదొంగ, కింగ్, శంభో శివ శంభో, నవవసంతం, పెళ్లైనకొత్తలో వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యింది.