వైరల్ గా నోరా ఫతేహి డీప్ ఫేక్ వీడియో... ఆమె రియాక్షన్ ఇదే 

Published : Jan 22, 2024, 09:18 AM IST
వైరల్ గా నోరా ఫతేహి డీప్ ఫేక్ వీడియో... ఆమె రియాక్షన్ ఇదే 

సారాంశం

డీప్ ఫేక్ టెక్నాలజీ సెలెబ్రిటీలను వణికిస్తోంది. కొందరు కేటుగాళ్లు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. తాజాగా నటి నోరా ఫతేహి ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు.   

 రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో అప్పట్లో సంచలనం రేపింది. బ్రిటన్ కి చెందిన జరా పటేల్ అనే అమ్మాయి వీడియోకి రష్మిక మందాన ముఖం మార్ఫింగ్ చేశారు. అది నిజంగానే రష్మికదే అని పలువురు భావించారు. రష్మిక మందానపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ డీప్ ఫేక్ వీడియోపై ఏకంగా అమితాబ్ బచ్చన్ స్పందించాడు. వీడియో షేర్ చేసిన అమితాబ్... ప్రభుత్వాలు తక్షణమే స్పందించాల్సిన విషయం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. 

రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశాడనే అనుమానాలపై గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రష్మిక డీప్ ఫేక్ వీడియో అనంతరం కాజోల్, అలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా నోరా ఫతేహి డీప్ ఫేక్ బారిన పడింది. 

నోరా ఫతేహి ఒక ఫ్యాషన్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నట్లు వీడియో వైరల్ సర్కిల్ అవుతుంది. సదరు వీడియో నోరా ఫతేహి దృష్టికి వెళ్లడంతో ఆమె షాక్ అయ్యారు. ఈ వీడియో ఉంది కాదని ఆమె క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు ఆగడం లేదు. 

కాగా నోరా ఫతేహి తెలుగులో మట్కా మూవీ చేస్తుంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా చిత్రానికి కరుణ కుమార్ దర్శకుడు. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్. అలాగే హరి హర వీరమల్లు చిత్రంలో నోరా ఫతేహి నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. చిత్రీకరణ మధ్యలో ఆగింది. 
 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌