హే సామ్ అంటూ సూటిగా అడిగేసిన సీతారామం బ్యూటీ... ఆమె రిప్లై ఇదే!

Published : Apr 12, 2023, 02:50 PM ISTUpdated : Apr 12, 2023, 02:57 PM IST
హే సామ్ అంటూ సూటిగా అడిగేసిన సీతారామం బ్యూటీ... ఆమె రిప్లై ఇదే!

సారాంశం

నటి మృణాల్ ఠాకూర్-సమంత మధ్య చిన్న చర్చ నడిచింది. సోషల్ మీడియా వేదికగా జరిగిన వారి చిరు సంభాషణ వైరల్ అవుతుంది.   

శాకుంతలం మూవీ విడుదల నేపథ్యంలో హీరోయిన్ సమంత చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. శాకుంతలం పాన్ ఇండియా మూవీగా విడుదలవుతుండగా ముంబైతో పాటు ప్రధాన నగరాల్లో సమంత చక్కర్లు కొట్టారు. శాకుంతలం చిత్రానికి సమంత ప్రధాన ఆకర్షణ. ఆమె లీడ్ రోల్ చేశారు. ఈ క్రమంలో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించాల్సిన బాధ్యత ఆమె మీదే ఉంది. గతంలో ఏ చిత్రాన్ని కూడా ఈ స్థాయిలో ప్రమోట్ చేయలేదు. మేకర్స్ ఈ విషయంలో ఆమెను గట్టిగానే రిక్వెస్ట్ చేసినట్లు ఉన్నారు.

మరో రెండు రోజుల్లో విడుదల అనగా సమంత ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఆస్క్ సామ్ హాష్ ట్యాగ్ తో ట్విట్టర్ చాట్ నిర్వహించారు. ఈ చాట్ లో అనూహ్యంగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్ పాల్గొన్నారు. సమంతకు ఆమె ఓ ప్రశ్న సంధించారు. 'హే సామ్ శాకుంతలం చిత్రం కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇంతకీ మనమిద్దరం ఎప్పుడు కలిసి నటిస్తున్నాం?' అని అడిగింది.

మృణాల్ కామెంట్ కి సమంత వెంటనే రిప్లై ఇచ్చారు. ఓకే దీని గురించి వెంటనే మాట్లాడుకుందాం.. అని సమంత మృణాల్ కి సమాధానం చెప్పారు. వీరిద్దరి ట్విట్టర్ సంభాషణ నెటిజెన్స్ ని ఆకర్షించింది. సీతారామం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన మృణాల్ మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలిచింది. ఆమెకు సీతారామం మూవీ భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నానికి జంటగా ఓ చిత్రానికి మృణాల్ సైన్ చేశారు.

ఇక శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల కానుంది. దర్శకుడు గుణశేఖర్ పౌరాణిక గాథగా శాకుంతలం తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. మణిశర్మ సంగీతం అందించారు. మోహన్ బాబు కీలక రోల్ చేస్తున్నారు. సమంతకు జంటగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి