పెళ్లి వార్తలపై స్పందించిన హీరోయిన్..!

Published : Aug 29, 2019, 11:40 AM ISTUpdated : Aug 29, 2019, 11:48 AM IST
పెళ్లి వార్తలపై స్పందించిన హీరోయిన్..!

సారాంశం

నటి హరిప్రియ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పలు టీవీలు, వెబ్‌సైట్లు కథనాలు సృష్టించాయి. వీటిని చూసిన నటి ట్విట్టర్ ద్వారా స్పందించింది.   

'తకిట తకిట', 'పిల్ల జమిందార్‌', 'జైసింహా' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి హరిప్రియ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. పలు టీవీ ఛానెల్స్, వెబ్ సైట్లు కథలను వెలువరించాయి.

వీటిని చూసిన ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఇప్పట్లో తను పెళ్లి చేసుకోవడం లేదని చెప్పింది. ప్రస్తుతం తన పాత్రలతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని.. అన్నింటికన్నా ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలంటే జీవిత భాగస్వామి కావాలని.. అలాంటి వ్యక్తి ఇంతవరకూ తన జీవితంలోకి రాలేదని చెప్పింది.

ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని.. కాబోయే వాడిని వెతకడానికి ఇదే సరైన సమయం అనుకుంటూ అంటూ కొంటెగా నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేసింది. హరిప్రియ వ్యక్తిగత జీవితంపై ఇలాంటి వార్తలు రావడం ఇది తొలిసారి కాదు..

గతంలో కూడా ఆమె ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అప్పట్లో కూడా ఆమె ఈ వార్తలను ఖండించింది. 

PREV
click me!

Recommended Stories

Sobhita Dhulipala: శోభితకు ఇష్టమైన సినిమా అదే, ఆమె భర్త చైతూది మాత్రం కాదు
Vishwambhara First Review: విశ్వంభర అప్‌డేట్‌, జేమ్స్ కామెరూన్‌ రేంజ్‌ విజువల్స్.. హైలైట్స్ ఇవే, సమస్య ఏంటంటే?