సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం.. హీరోయిన్ ఎవరో తెలుసా!

Siva Kodati |  
Published : May 27, 2019, 09:03 PM IST
సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం.. హీరోయిన్ ఎవరో తెలుసా!

సారాంశం

మెగా హీరో సాయిధరమ్ తేజ్ చిత్రలహరి చిత్రంతో ఎట్టకేలకు వరుస పరాజయాల నుంచి గట్టెక్కాడు. ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అదే ఉత్సాహంతో సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రానికి రెడీ అవుతున్నాడు. తేజు తదుపరి చిత్రంపై ఇప్పటి నుంచే మంచి అంచనాలు మొదలయ్యాయి. 

మెగా హీరో సాయిధరమ్ తేజ్ చిత్రలహరి చిత్రంతో ఎట్టకేలకు వరుస పరాజయాల నుంచి గట్టెక్కాడు. ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అదే ఉత్సాహంతో సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రానికి రెడీ అవుతున్నాడు. తేజు తదుపరి చిత్రంపై ఇప్పటి నుంచే మంచి అంచనాలు మొదలయ్యాయి. ఎందుకంటే తేజు నెక్స్ట్ మూవీని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. 

ఈ చిత్రంలో హీరోయిన్ గా నేల టికెట్టు ఫేమ్ మాళవిక శర్మని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మాళవిక శర్మ నేల టికెట్టు చిత్రంతో పరాజయాన్ని మూటగట్టుకుంది. కానీ ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ పరంగా యువతని ఆకట్టుకుంది. తేజు సరసన నటించే అవకాశం రావడం మాళవిక శర్మ అదృష్టమనే చెప్పొచ్చు. 

ఈ చిత్రంలో సీనియర్ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో నటించనున్నారు. మారుతి చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం సీరియస్ కథాంశంతో ఉండబోతున్నట్లు వినికిడి. త్వరలో ఈ చిత్రానికి సంబందించినా విశేషాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Jr NTR: ఏఎన్నార్ అడిగిన ఒక్క మాటతో జూ.ఎన్టీఆర్ ఆశలు గల్లంతు.. దాన వీర శూర కర్ణ ఇక లేనట్లే ?
Champion Movie Review: ఛాంపియన్‌ మూవీ రివ్యూ.. శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?