హాలీవుడ్ నటికి తెలుగు నేర్పిస్తున్న ఆలియా భట్.. వైరల్ అవుతున్న వీడియో..

Published : Aug 08, 2023, 01:49 PM ISTUpdated : Aug 08, 2023, 01:50 PM IST
హాలీవుడ్ నటికి తెలుగు నేర్పిస్తున్న ఆలియా భట్.. వైరల్ అవుతున్న వీడియో..

సారాంశం

ఒక బాలీవుడ్ నటి ఆలియా భట్.. హాలీవుడ్ నటికి  తెలుగు నేర్పిస్తుంది. వింటానికి విచిత్రంగా ఉన్నా.. అది నిజం. అవును.. తనకే రాని తెలుగును హాలీవుడ్ నటికి నేర్పిస్తోంది ఆలియా.   

బాలీవుడ్ లో వారసత్వంగా వచ్చినా.. సొంత కాళ్ల మీద నిలబడింది బాలీవుడ్ నటి ఆలియా భట్. సొంతంగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సంపాదించుకుంది. అంతే కాదు బాలీవుడ్ తో పాటు.. టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది ఆలియా భట్. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా  తెలుగు తెరకు పరిచయం అవ్వడమే కాదు.. పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా మారిపోయింది ఆలియా భట్. ఈక్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ లో, హాలీవుడ్ లో కూడా మంచి ఇమేజ్ తెచ్చుకుంది బ్యూటీ. 

బాలీవుడ్‌లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో నే  అటు తెలుగు ప్రేక్షకులకు.. ఆస్కార్ తో ఇటు హాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. ఈసినిమలో..సీత పాత్రలో...ఆలియా భట్ ను చూసిన బాలీవుడ్ అభిమానులు..ఆలియా నటకకు ఇంప్రెస్ అయ్యారు. చేసింది తక్కువ నివిడి ఉన్న పాత్రే అయినా..  తన అభినయానికి ఫ్యాన్స్‌ మంత్రముగ్ధులయ్యారు. ఇక తాజాగా ఆలియా భట్ హాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. . 'హార్ట్ ఆఫ్ స్టోన్'తో ఆమె తెరంగేట్రం చేయనుంది.

 

బ్రహ్మాస్త్ర సినిమా తరువాత పెళ్ళి.. పిల్లలతో ఆలియా భట్.. వెండితెరకు కొంత కాలం దూరంఅయ్యింది. పాప ఆలనా కోసం ఇంకాస్త గ్యాప్ తీసుకున్నఆలియా భట్.. రీసెంట్ గా మళ్ళీ సినిమాల్లో యాక్టీవ్ అవుతోంది. అయితే బాలీవుడ్ సినిమాలతో పాటు.. హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన యంగ్ బ్యూటీ హీరోయిన్ కు ఈసినిమాలో నటించిన  హాలీవుడ్‌ నటులు గాల్ గాడోట్, జామీ డోర్నన్‌లతో స్నేహం ఏర్పడింది. ఇక ఈసినిమా ఈనెల  11న నెట్ ప్లిక్స్ వేధికగా స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. వరుస వీడియోలు.. వరుసగా  ఇంటర్వ్యూలతో ఆమె  బిజీ బిజ అయిపోయింది. అంతే కాదు హాలీవుడ్ నటితో పాటు ప్రమోషపనస్ లో పాల్గొనింది ఆలియా.  తన సహనటి గాల్ గాడోట్‌కి తెలుగులో కొన్ని మాటలు నేర్పించి ఆకట్టుకుంది ఆలియా భట్. గాడోట్‌ కూడా ఆలియా చెప్పిన తెలుగు పదాలు పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్‌‌ లో నటిస్తున్న సమయంలో ఆలియా కొన్ని తెలుగు పదాలు నేర్చుకుంది.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..