‘పుష్ప2 : ది రూల్’ నుంచి ఫహద్ ఫాజిల్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రం గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తాజాగా అప్డేట్ అందించారు.
‘పుష్ప : దిరైజ్’కు సీక్వెల్ గా వస్తున్న చిత్రం Pushpa 2 The Rule. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ కు మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈరోజు ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా ‘పుష్ఫ 2’ నుంచి యూనిట్ ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. మాస్ అవతార్ లో ఫాహద్ ఆకట్టుకుంటున్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకు వస్తున్నడంటూ మేకర్స్ పేర్కొన్నారు. పోలీస్ చొక్కా ధరించి, సిగర్ తాగుతూ, సన్ గ్లాసెస్ పెట్టుకొని ఫాహద్ ఇంట్రెస్సివ్ లుక్ లో కనిపించారు.
ఇక మొదటి భాగంలో పుష్ప రాజ్ - బన్వర్ సింగ్ షెకావత్ సార్ మధ్య పోరు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక రెండో భాగంలో వీరిద్దరి మధ్య అసలైన యాక్షన్ ఉండబోతోంది. ఈ సందర్భంగా పుష్పరాజ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు షెకావత్ సార్ తిరిగి వెండితెరపైకి వస్తున్నారని తెలిపారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. కీలకమైన సన్నివేశాలను పూర్తి చేశారని అంటున్నారు. మిగితా షూటింగ్ పార్ట్ ను కూడా త్వరలోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులనూ ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. భారీ స్కేల్లో ఈ మూవీని రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. చిత్రానికి దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నారు. సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తుండగా.. మరికొందరు స్టార్ కాస్ట్ యాడ్ కాబోతున్నట్టు తెలుస్తోంది.
Team wishes the Massively Talented a very Happy Birthday ❤🔥
Bhanwar Singh Shekhawat Sir will be back on the big screens with vengeance 🔥
Icon Star pic.twitter.com/kGBo7o4NlY