
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న తాజా సినిమా లియో. తమిళయంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈమూవీలో అభిరామి వెంకటాచలం నటిస్తోంది. అయితే ఈహీరోయిన్ చేసిన పనులకు సోషల్ మీడియా జనాలు ఔరా అంటున్నారు. ఈమె రీసెంట్ గా రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె తన వీపుపై నటరాజస్వామి టాటూను వేసుకుని కనిపించింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది.
నటరాజస్వామి ఫోటోన్ అక్కడ టాటూగా వేసుకోవడం ఏంటీ అని పలువురు విమర్షిస్తున్నారు. ఈక్రమంలోనే ఈ టాటూపై పెద్ద రచ్చ జరుగుతోంది. అంతే కాదు ఆమె రీసెంట్ గా మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాలహస్తికి వెళ్తూ.. మధ్యలో కారు ఆపి రోడ్డుమీద డాన్స్ కూడా చేసింది. ఇవన్నీ చూసి అభిరామికి ఏమైంది ఇలా చేస్తుంది అంటూ ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఈక్రమంలోనే ఆమె మాత్రం ఎవరు ఏం అనుకున్నా డోంట్ కేర్ అంటోంది. తాజాగా ఆమె వీపుపై నటరాజ స్వామి టాటూ కనిపించడంపై వస్తున్న విమర్షలను ఆమె తిప్పి కొట్టారు.
అంతే కాదు తనకు భక్తి విషయంలో ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు అభిరామి . అంతే కాదు తాను ఆరాధించే పరమశివుడిని ఎక్కుడ ఉంచాలి అనేది పూర్తిగా తన వ్యాక్తిగత విషయం అని. ఇందులో ఎవరి మాట తనాను విననంటై తేల్చేసింది బ్యూటీ. ప్రస్తుతం అభిరామి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీవ్ర దుమారాన్ని రేపడంతో పాటు.. ఆమెపై కూడా తీవ్ర స్థాయిలో విమర్షలు వస్తున్నాయి. ఈక్రమంలో ఆమె ఏం చేస్తుందో చూడాలి.
సోషల్ మీడియాలో , బుల్లితెరపై బాగా పాపులారిటీ సాధించింది అభిరామి.. విజయ్ దేవరకొండ నోటా సినిమా ద్వారా అటు తమిళ తెరకు.. ఇటు తెలుగు తెరకు ఒకేసారి పరిచయం అయ్యింది. అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ నెక్కొండ పార్వాయి లో నటించి ఈమూవీటీ.. తమిల పరిశ్రమలో వరుస ఆఫర్లు అందుకుంది. సీనియర్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం విజయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. టెలివిజన్ ప్రోగ్రామ్స్ తో పాటు.. మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసి.. స్పెషల్ ఇమేజ్ సాధించింది బ్యూటీ.