Samantha 2022 Plans: వాళ్లతో గడిపేస్తా... సమంత నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్

Published : Dec 31, 2021, 12:14 PM ISTUpdated : Dec 31, 2021, 12:18 PM IST
Samantha 2022 Plans: వాళ్లతో గడిపేస్తా... సమంత నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్

సారాంశం

సమంత గోవా ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ నేషనల్ మీడియాతో ముచ్చటించిన సమంత పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. న్యూ ఇయర్ ప్లాన్స్ తో పాటు బాలీవుడ్ ఎంట్రీపై మనసులోని మాట బయటపెట్టారు.   

సమంత న్యూ ఇయర్ (New Yera 2022) సెలబ్రేషన్స్ మూడ్ లో ఉన్నారు. ఆమె 2022 సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి గోవా వెళ్లారు. తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో పాటు గోవాలో మకాం వేశారు. సమంత గోవా ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ నేషనల్ మీడియాతో ముచ్చటించిన సమంత పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. న్యూ ఇయర్ ప్లాన్స్ తో పాటు బాలీవుడ్ ఎంట్రీపై మనసులోని మాట బయటపెట్టారు. 

ఇక ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ తో బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీలో ప్రాజెక్ట్స్ చేయడానికి సిద్ధమయ్యారా? అన్న ప్రశ్నకు సమాధానంగా... అసలు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఆ ఆలోచన కూడా లేదు, అయితే రాజ్&డీకే తన ఆలోచన మార్చివేశారని, ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ చేయడానికి ప్రేరణ ఇచ్చారన్నారు. ఇక బాలీవుడ్ లో ప్రయత్నాలు చేయకపోవడనికి కారణం.. నాపై నాకు నమ్మకం లేకపోవడమే. ఇక్కడ నేను రాణించగలనా.. ఆ సత్తా నాలో ఉందా? అనే సందేహం కలిగేది. ఇప్పుడు కొంచెం ఆత్మవిశ్వాసం పెరిగింది అన్నారు. 

అలాగే ఎంట్రీకి సరైన సమయం కూడా అవసరం. అందుకే బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి ఆలస్యమైంది అన్నారు సమంత. ఇక వెబ్ సిరీస్ కారణంగా... యూనిక్, వర్సటైల్ రోల్స్ చేసే అవకాశం దక్కుతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలలో రాజీ లాంటి భిన్న షేడ్స్ ఉన్న డార్క్ రోల్ చేయడానికి అవకాశం ఉండదు అన్నారు. 

అలాగే రీమేక్స్ పై కూడా స్పందించారు. గతంలో నేను కొన్ని రీమేక్స్ చేశాను. అయితే ప్రస్తుతం రీమేక్స్ చేసే ఆలోచన లేదు. కొన్నాళ్ళు రీమేక్స్ జోలికి వెళ్ళకూడదనుకుంటున్నా.. అన్నారు. ఇక 2021లో ఆమె ఎదుర్కున్న సవాళ్ళను, రానున్న సంవత్సరం కోసం సన్నద్ధత గురించి అడుగగా.. ఇలా అన్నారు. కష్ట సమయాల్లో నాకు బలమైన మద్దతు ఇచ్చే మిత్రులు ఉన్నారు. వాళ్లతో ఎక్కువ సమయం గడిపేస్తాను. అలాగే మా పేరెంట్స్, పెట్ డాగ్స్ తో వచ్చే ఏడాది గడపడుపుతానని సమంత (Samantha) తన మనసులో మాట బయటపెట్టారు. 

Also read Samantha: సమంత జోరు ముందు నిలబడలేకపోయిన బోల్డ్ బ్యూటీ

సమంత ప్రస్తుతం దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం(Shakunthalam) మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అలాగే యశోద (Yashoda)పేరుతో ఓ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో విడుదల కానున్నాయి. 2022లో సమంత నుండి మూడు చిత్రాల వరకు విడుదల కానున్నాయి. కాగా 2021 సమంత జీవితంలో డార్క్ ఇయర్. వ్యక్తిగతంగా సమంత అనేక విమర్శలపాలైంది. నాగ చైతన్యతో విడాకులు ఆమెను మానసిక వేదనకు గురిచేశాయి. ఆమె క్యారెక్టర్ ని తప్పుబడుతూ నిరాధార కథనాలు వెలువడ్డాయి. అలాగే సమంత డెబ్యూ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ 2 విమర్శల పాలైంది.  తమిళులు సమంత రోల్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.

Also read Samantha : నిన్ను మాత్రమే నమ్ముతా.. స్టార్ హీరో గురించి సమంత ఎమోషనల్ పోస్ట్.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు