సమంత కొత్త వ్యాపారం!

Published : Jun 21, 2021, 07:38 AM IST
సమంత కొత్త వ్యాపారం!

సారాంశం

నాగార్జున ఇంటికి కోడలిగా వెళ్లిన సమంత సినిమాలు చేస్తే సరిపోతుందిలే అనుకోవడం లేదు. ఆమె ఇప్పటికే సాకి పేరుతో గార్మెంట్ బ్రాండ్ రన్ చేస్తున్నారు. కొత్తగా ఆమె మరో వ్యాపారం మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట.

ఈ జనరేషన్ హీరోలు, హీరోయిన్స్ ఏదో ఒక రంగంలో రాణిస్తే సరిపోతుందిలే అనుకోవడం లేదు. లైఫ్ ని ఛాలెంజ్ గా తీసుకుంటూ...  వ్యాపారాలు అంటూ కొత్త బాధ్యతలు తీసుకుంటున్నారు. టాలీవుడ్ కి చెందిన చాలా మంది హీరోలు, హీరోయిన్స్ కి సొంత బిసినెస్ లు ఉన్నాయి. అంతెందుకు  మహేష్ బాబు నిర్మాణ సంస్థ స్థాపించడంతో పాటు, థియేటర్స్, గార్మెంట్స్ బిజినెస్ లు స్థాపించారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన పేరుతో ఓ గార్మెంట్ బ్రాండ్ రన్ చేస్తున్నారు. అలాగే ఆయనకు సొంత సినిమా బ్యానర్ కూడా ఉంది. 


ఈ విషయంలో హీరోయిన్స్ కూడా ఏం తక్కువ కాదు. కోట్లాధిపతి నాగార్జున ఇంటికి కోడలిగా వెళ్లిన సమంత సినిమాలు చేస్తే సరిపోతుందిలే అనుకోవడం లేదు. ఆమె ఇప్పటికే సాకి పేరుతో గార్మెంట్ బ్రాండ్ రన్ చేస్తున్నారు. కొత్తగా ఆమె మరో వ్యాపారం మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట. సాకి మంచి సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో అనుబంధంగా జ్యూవెలరీ బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. దీనికి సంబంధించిన ప్రణాళిక పూర్తికాగా త్వరలో అధికారిక ప్రకటన ఉంటుంది అంటున్నారు. 


ఇక నటిగా సూపర్ ఫార్మ్ లో సమంత క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఆమె డెబ్యూ డిజిటల్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 భారీ విజయం అందుకుంది. దీనితో ఆమెకు మరిన్ని ఓటిటి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. మరోవైపు దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం అనే పాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. శాకుంతలం మూవీలో సమంత ప్రధాన పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌