'అల..వైకుంఠపురుములో' హిందీ రీమేక్ లేటెస్ట్ అప్డేట్

By Surya PrakashFirst Published Jun 20, 2021, 4:11 PM IST
Highlights

 ‘అల..వైకుంఠపురుములో. సంక్రాంతి కానుకగా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం బన్ని కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. 

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘అల..వైకుంఠపురుములో. సంక్రాంతి కానుకగా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం బన్ని కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. అనేక చోట్ల బాహుబ‌లి రికార్డులు కూడా తిరగరాసిన ఈ చిత్రం ఆ తర్వాత బుల్లితెర‌పై కూడా సునామి సృష్టించింది.  టీవీలో ప్రసారం అయిన ఈ సినిమా అత్యధికంగా 29.4 టీఆర్పీ రేటింగ్ సంపాదించి రికార్డు బ్రేక్‌ చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రీమేక్ రైట్స్ కు పోటీ  ఏర్పడింది. ప్రస్తుతం హిందీలోకి రీమేక్ అవుతోంది. 

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ..తెలుగులో అల్లు అర్జున్ చేసిన పాత్రలో హిందిలో కార్తీక్ ఆర్యన్ తో చేసేందుకు రెడీ అయ్యారట. ఇక హీరోయిన్ గా కృతి సనన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.  సినిమాలో హీరో తల్లి క్యారెక్టర్ అయిన టబు పోషించిన క్యారెక్టర్ హిందీలో ఎవరు చేస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే ఆ పాత్రలో ప్రస్తుతం సీనియర్ బ్యూటీ మనీషా కోయిరాల ఓకే అయినట్లు తెలుస్తుంది. దర్శకుడు డేవిడ్ ధావన్ ఆల్రెడీ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసాడట.

బాలీవుడ్ కథనాల ప్రకారం.. ఆ క్యారెక్టర్ కోసం ఒరిజినల్ పోషించిన టబునే సంప్రదించారట. కానీ ఆమె ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉండేసరికి మరో యాక్టర్ దగ్గరకు వెళ్లకతప్పలేదని టాక్. ఈ సినిమాను  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. అలాగే ఇంతకు  ముందు కార్తీక్ ఆర్యన్ - కృతిసనన్ కలిసి లుక్కాచుప్పి సినిమాలో నటించారు. ఈ  సినిమాతో ఈ కాంబో మరోసారి హిట్ కొడుతుందంటున్నారు.

హిందీలో అలవైకుంఠపురం రీమేక్ కి రెడీ అవుతుంటే మరో వైపు సౌత్ లోనే తమిళ్ లో కూడా రీమేక్ చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నారు. శివ కార్తికేయన్ హీరోగా ఈ సినిమాని రీమేడ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమీజా..తమిళ్ వర్‌షన్ కి మ్యూజిక్ అందించబోతున్నారు. ఇలా హిందీలో కార్తీక్ ఆర్యన్, తమిళ్ లో శివకార్తికేయన్ కలిసి .. సంక్రాంతి విన్నర్ అయిన అలవైకుంఠపురం సినిమాని రీమేక్ చెయ్యబోతున్నారు.

click me!