వారిద్దరితో నాకు అలాంటి సంబంధం లేదంటున్న రానా హీరోయిన్..!

By Satish ReddyFirst Published Aug 14, 2020, 7:39 PM IST
Highlights

లీడర్, రామ రామ కృష్ణ కృష్ణ, 180 వంటి చిత్రాలలో నటించిన ప్రియా ఆనంద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అమ్మడుకి సరైన బ్రేక్ రాకపోవడంతో టాలీవుడ్ లో కనుమరుగయ్యింది. ప్రస్తుతం కన్నడ మరియు తమిళ భాషలలో చిత్రాలు చేస్తున్న ప్రియా ఆనంద్  ఎఫైర్స్ పై పుకార్లు వస్తున్నాయి. 

తమిళ బ్యూటీ ప్రియా ఆనంద్ కెరీర్ బిగినింగ్ లో కొన్ని క్రేజీ ఆఫర్స్ దక్కించుకున్నా, లక్ కలిసి రాలేదు . ఆమె నటించిన ఒక్క చిత్రం కూడా తెలుగులో భారీ విజయాన్ని అందుకోలేదు. దగ్గుబాటి రానా డెబ్యూ మూవీ లీడర్ లో ప్రియా ఆనంద్ ఒక హీరోయిన్ గా నటించింది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఆ పొలిటికల్ ఎంటర్టైనర్ జస్ట్ పర్వాలేదు అనిపించుకుంది. ఆ తరువాత రామ్ సరసన రామ రామ కృష్ణ కృష్ణ, సిద్దార్ధ్ హీరోగా తెరకెక్కిన 180 చిత్రాలలో నటించింది. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో తెలుగులో ఈమెకు ఆఫర్స్ ఆగిపోయాయి. తమిళ పరిశ్రమలో కొన్నాళ్లు వరుసపెట్టి సినిమాలు చేసిన ప్రియా ఆనంద్, దివంగ శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో కీలక రోల్ చేశారు. 

సినిమాల సంగతి ఎలా ఉన్నా అమ్మడుకి ఎఫైర్స్ కేమి తక్కువ లేదంటూ వార్తలు వస్తున్నాయి. తమిళ పరిశ్రమలోని ఇద్దరు యంగ్ హీరోలతో ఈమె సన్నిహితంగా ఉంటున్నట్లు టాక్. వీరితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ప్రియా ఆనంద్ ఒకరిని పెళ్లి కూడా చేసుకోనుంది అనేది తమిళ మీడియా కథనాల సారాంశం. వారిద్దరిలో ఒకరు గద్దలకొండ గణేష్ మూవీలో  నటించిన అధర్వ కాగా, మరొకరు సీనియర్ నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ అట. వీరిద్దరితో ప్రియా ఆనంద్ సన్నిహితంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

కాగా ఈ వార్తలకు ప్రియా ఆనంద్ స్పందించారు. వారిద్దరూ తనకు మంచి మితృలని చెప్పిన ప్రియా ఆనంద్, మా మధ్య అటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అధర్వ, గౌతమ్ మరియు ప్రియా మంచి మితృలు అని చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఐతే రిలేషన్ లో ఉన్న ఏ హీరోయినైనా చెప్పే మాటలే ఇవి అని కొందరు కొట్టిపారేస్తున్నారు. నిజంగా వారిమధ్య అలాంటింది ఏదైనా ఉంటే ఎప్పటికైనా బయపటపడకమానదు.

click me!