ప్రముఖ దర్శకుడు సాగర్‌ సర్జాది కన్నుమూత

Published : Mar 22, 2021, 02:08 PM IST
ప్రముఖ దర్శకుడు సాగర్‌ సర్జాది కన్నుమూత

సారాంశం

ప్రముఖ బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు, రచయిత సాగర్‌ సర్హాది(87) కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. `నూరి`, `బజార్‌`, `కబీ కబీ`, `సిల్సిలా`, `చాందిని`, `దీవానా`, `కహో నా ప్యార్‌ హై` చిత్రాలకు పనిచేసి మంచి గుర్తింపుని, పేరుని తెచ్చుకున్నారు.

ప్రముఖ బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు, రచయిత సాగర్‌ సర్హాది(87) కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. `నూరి`, `బజార్‌`, `కబీ కబీ`, `సిల్సిలా`, `చాందిని`, `దీవానా`, `కహో నా ప్యార్‌ హై` చిత్రాలకు పనిచేసి మంచి గుర్తింపుని, పేరుని తెచ్చుకున్నారు. ఉర్దూ నాటక రచయితగా ఇప్పటికీ చాలా మంది అభిమానిస్తారు. సాగర్‌ సర్హాది 1976లో హిట్‌ అయిన `కబీ కబీ` చిత్రానికి డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంతోనే ఆయన మంచి పేరొచ్చింది. అతను చేసిన కృషికిగానూ ఉత్తమ డైలాగ్‌ కేటగిరిలో ఫిల్మ్ ఫేర్‌ అవార్డుని అందుకున్నారు. 

`కబీ కబీ` చిత్రంలో అమిఆబ్‌ బచ్చన్‌, శశి కపూర్‌, రాఖీ, వహీదా రెహ్మాన్‌, రిషికపూర్‌, నీతూ సింగ్‌ నటించారు. దీనికి యశ్‌ చోప్రా దర్శకత్వం వహించడం విశేషం.  `కబీ కబీ` చిత్రం తర్వాత, సాగర్‌ సర్హాది `నూరి`, `చాందిని`, `సిల్సిలా` సినిమాలకు డైలాగ్స్ రాశారు. ఆయన పలు చిత్రాలను నిర్మించారు కూడా.  బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సాగర్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నటుడు జాకీ ష్రాఫ్‌ సంతాపం తెలియజేశారు. `మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం. మీ ఆత్మకి శాంతి చేకూరాలి సాగర్‌` అని సంతాపం తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోని పంచుకున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?
Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు