Janhvi Kapoor: తన బెస్ట్ ఆర్మీని పరిచయం చేసిన జూనియర్ శ్రీదేవి జాన్వీ...!  

By Sambi ReddyFirst Published May 16, 2022, 7:21 PM IST
Highlights


జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ తన ఆర్మీ ని పరిచయం చేసింది. తనను అందంగా చూపించడం కోసం పనిచేసే టీమ్ ఫోటోలు షేర్ చేసింది. 
 


జాన్వీ కపూర్ (Janhvi Kapoor)సోషల్ మీడియా చాలా యాక్టీవ్. టైం టు టైం తన వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆమె హాట్ అండ్ ట్రెండీ ఫోటో షూట్స్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటారు. జాన్వీ గ్లామర్ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఆమె అకౌంట్ క్రమంగా ఫాలో అవుతూ ఉంటారు. జాన్వీ ఇమేజ్ రీత్యా ఆమెను లక్షల్లో ఫాలో అవుతున్నారు. ఏకంగా 16 మిలియన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆమెకు ఉన్నారు. 

కాగా తన గ్లామరస్ ఫోటో షూట్స్ వెనుకున్న టీమ్ ని జాన్వీ కపూర్ పరిచయం చేశారు. ప్రతి ఈవెంట్, షూట్ కి తనని అందంగా సిద్ధం చేసే సిబ్బందిని ఆర్మీగా అభివర్ణించింది జాన్వీ కపూర్. ఆ విషయంలో తన టీమ్ చాలా బెస్ట్ అంటూ వాళ్లపై ప్రశంసలు కురిపించింది. అలాగే సూపర్ గ్లామరస్ గా సిద్ధమవుతున్న ఫోటోలు షేర్ చేశారు. మరి తెర వెనుక ఉండే తన టీమ్ కి గుర్తింపు వచ్చేలా ఆమె పరిచయం చేయడం అభినందించదగ్గ విషయమే. 

కాగా శ్రీదేవి చిన్న కూతురు జాన్వీ చెల్లి ఖుషి కపూర్ సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ది ఆర్కీస్ పేరుతో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామిక్ సిరీస్ లో ఖుషి నటిస్తున్నారు. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కిన ది ఆర్కీస్ సిరీస్ లో షారుక్ కూతురు సుహానా ఖాన్ సైతం నటిస్తున్నారు. ఇక చెల్లి ఖుషి డెబ్యూ ప్రాజెక్ట్ ని ప్రమోట్ చేస్తూ జాన్వీ కపూర్ ఓ భావోద్వేగ సందేశం పంచుకోవడం జరిగింది. 

మరోవైపు జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. ఆమె నాలుగు హిందీ చిత్రాలలో నటిస్తున్నారు. గుడ్ లక్ జెర్రీ, మిల్లీ చిత్రాలతో పాటు మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవాల్ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. జాన్వీ మొదటి చిత్రం ధడక్ విడుదలై నాలుగేళ్లు అవుతుంది. 2018లో ఈ చిత్రం విడుదల కాగా రెండు చిత్రాలతో పాటు ఓ యాన్థాలజీ  సిరీస్ చేశారు. 

click me!