పబ్లిక్ లో చెల్లితో కలిసి సైకిల్ రైడ్ చేసిన స్టార్ హీరోయిన్!

Published : May 26, 2021, 04:47 PM IST
పబ్లిక్ లో చెల్లితో కలిసి సైకిల్ రైడ్ చేసిన స్టార్ హీరోయిన్!

సారాంశం

జిమ్ కి ఎప్పుడూ కారులో వచ్చే జాన్వీ భిన్నంగా సైకిల్ పై వచ్చారు. పబ్లిక్ ప్రదేశంలో జాన్వీ సైకిల్ పై రైడ్ చేయడం సంచలనంగా మారింది. మాస్క్ ధరించి జాన్వీ జిమ్ దుస్తులలో రైడ్ చేస్తూ కనిపించారు. 

యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ వెండితెరకు పరిచయమై దాదాపు మూడేళ్లు అవుతుంది. ఈ మూడేళ్ళ కాలంలో చక చకా ఐదు సినిమాలు చేసింది అమ్మడు. ఆమె మొదటి చిత్రం ధడక్ 2018లో విడుదల కావడం జరిగింది. అందంతో పాటు మంచి అభినయం ప్రదర్శిస్తున్న జాన్వీ కోసం దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. జాన్వీ లేటెస్ట్ మూవీ రూహి. హారర్ కామెడీగా విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. 


కాగా జాన్వీ చేతిలో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ చిత్రాలలో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. హిట్ మూవీ దోస్తానాకు సీక్వెల్ గా వస్తున్న దోస్తానా 2 చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా అందం విషయంలో జాన్వీ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయడం జాన్వీ కి అలవాటు. 


జిమ్ కి ఎప్పుడూ కారులో వచ్చే జాన్వీ భిన్నంగా సైకిల్ పై వచ్చారు. పబ్లిక్ ప్రదేశంలో జాన్వీ సైకిల్ పై రైడ్ చేయడం సంచలనంగా మారింది. మాస్క్ ధరించి జాన్వీ జిమ్ దుస్తులలో రైడ్ చేస్తూ కనిపించారు. జాన్వీని చూసిన ముంబై వాసులు కెమెరాలకు పని చెప్పారు. జాన్వీతో పాటు ఆమె చెల్లెలు ఖుషీ కపూర్ కూడా ఉండడం విశేషం. అక్కా చెల్లెళ్లు సైకిల్ రైడ్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. మరోవైపు ఖుషీ కపూర్ వెండితెర ఎంట్రీకి సిద్ధం అవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?