Anupama Parameswaran: తల్లైన అనుపమ పరమేశ్వరన్.. వైరల్ గా బేబీ బంప్ ఫోటోలు

Published : Jan 31, 2022, 03:29 PM IST
Anupama Parameswaran: తల్లైన అనుపమ పరమేశ్వరన్.. వైరల్ గా బేబీ బంప్ ఫోటోలు

సారాంశం

మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ని గర్భవతిగా చూసి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ చూసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. పెళ్లి కాకుండానే ఈ గర్భం ఏంటంటూ చెవులు కొరుక్కుంటున్నారు.

అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా లో చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. కారణం ఆమె సదరు ఫొటోలలో గర్భవతిగా కనిపించారు. పెళ్లి కాని 25ఏళ్ల అనుపమ గర్భవతి ఎప్పుడయ్యిందని అందరూ షాక్ తింటున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనుపమ అన్ని విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. గతంలో సరదాగా ఇంట్లో గర్భవతి గెటప్ వేసింది అనుపమ. అప్పటి ఫోటోలను షేర్ చేసిన అమ్మడు, ఫన్నీ కామెంట్స్ చేసింది. అంతకు మించి సదరు ఫోటోల వెనుక రహస్యం ఏమీ లేదు. 

ఏమైనా పెళ్లికాని యువతి గర్భవతి గెటప్ లో కనిపించడం కొంచెం కంగారు పెట్టే అంశమే. మరో వైపు అనుపమ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమె హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. 2017 సంక్రాంతి కానుకగా విడుదలైన శతమానం భవతి చిత్రం సూపర్ అయ్యింది. ఆ ఏడాది సంక్రాంతి విన్నర్ గా ఆ మూవీ నిలిచింది. శతమానం భవతి మూవీ తర్వాత అనుపమ నటించిన చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. 

2019లో విడుదలైన రాక్షసుడు మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే అనుపమకు ఆ మూవీ వలన దక్కిన ప్రయోజనం ఏమీ లేదు. ఇక అనుపమ లేటెస్ట్ రిలీజ్ రౌడీ బాయ్స్ కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మొన్నటి వరకు హోమ్లీ రోల్స్ చేసిన అమ్మడు, కొంచెం హద్దలు మీరు నటించారు. లిప్ లాక్ సన్నివేశాల్లో పాల్గొన్నారు. అంత రిస్క్ చేసినా ఫలితం మాత్రం దెబ్బేసింది.

అయితే అనుపమ చేతిలో మూడు తెలుగు చిత్రాలు ఉన్నాయి. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాలలో నటిస్తున్నారు. అలాగే హెలెన్ టైటిల్ తో తెరకెక్కుతున్న మరో చిత్రం చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. నిఖిల్ కార్తికేయ 2 మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. ఈ చిత్రాల విజయంపైనే అనుపమ కెరీర్ ఆధారపడి ఉంది. విజయం దక్కని నేపథ్యంలో ఆమెకు ఆఫర్స్ రావడం కష్టమే. 

ఈ మధ్య సోషల్ మీడియాలో అనుపమ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది అనుపమలో వచ్చిన ఈ ఛేంజ్ ఏమిటని అందరూ షాక్ అవుతున్నారు. ఆఫర్స్ తగ్గడంతో పంథా మార్చారేమో అనిపిస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే