Tillu Squre New Release Date : సిద్ధూ ‘టిల్లు స్క్వేర్’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

By Nuthi Srikanth  |  First Published Jan 26, 2024, 10:27 AM IST

‘టిల్లు స్క్వేర్’ Tillu Square మూవీ మళ్లీ వాయిదా పడింది. వచ్చే నెలలో థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం ఇంకాస్తా ముందుకు వెళ్లింది. కొత్త డేట్ ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. 


‘డీజే టిల్లు’తో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ Jonnalagadda ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో 2022లో విడుదలైన ఈ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ రాబోతోంది. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు ‘స్క్వేర్’ Tillu Square కోసం అభిమానులు, సాధారణ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే  ఈ చిత్రం మాటిమాటికి వాయిదా పడుతూ వస్తోంది. 

తొలుత గతేడాది సెప్టెంబర్ 15న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ మల్టీపుల్ మూవీ రిలీజెస్ తో అప్పుడు వాయిదా వేశారు. 2024 ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుద ల చేస్తామన్నారు. కానీ ఫిబ్రవరిలో మళ్లీ సినిమాల సందడి మొదలు కావడంతో మరోసారి చిత్రాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు కొత్త డేట్ ను అనౌన్స్ చేస్తూ ప్రకటన చేశారు. 

Latest Videos

‘టిల్లు స్క్వేర్’ చిత్రాన్ని 2024 మార్చి 29న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ఏప్రిల్ లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ను చూడాలని భావిస్తోంది. సమ్మర్ ను క్యాచ్ చేసేందుకు డేట్ ను వాయిదా వేశారు. ఏదేమైనా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా ఎప్పుడొచ్చిన మంచి రిజల్ట్ ఉంటుందని అంటున్నారు. పైగా ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ కూడా సినిమాపై హైప్ పెంచుతూనే ఉన్నాయి. 

రామ్ మిరియాల స్వరపరిచిన ఆల్బమ్‌లోని "టికెట్ ఎహ్ కొనకుండా", "రాధిక" వంటి పాటలు ఇప్పటికే ట్రెండ్ అయ్యాయి. చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. మేకర్స్ నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 9 నుండి విడుదలను వాయిదా వేయవలసి వచ్చిందన్నారు. వేసవి సెలవుల్లో టిల్లు ఆట మొదలుపెట్టనున్నారు. చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

click me!