
మాస్ యాక్షన్ హీరోగా తెలుగు,తమిళ భాషల్లో విశాల్ కి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను కాపాడుకోవడం కోసం తెగ ప్రయత్నం చేస్తున్నాడు విశాల్. ఈ మధ్య విశాల్ చేసిన ప్రతీ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా పడుతుంది. దాంతో ఈసారి సరికొత్త లుక్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు విశాల్. లాఠి సినిమాతో తమిళ,తెలుగు ఆడియ్స్ ను అలరించబోతున్నాడు.
రమణ - నంద నిర్మిస్తున్న ఈ సినిమాకి వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో విశాల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చాలా సినిమాలు చేశాడు. వెరీ రీసెంట్ ఆన తెలుగులో ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాను కూడా రీమేక్ చేశాడు. అయితే ఈ సారి ఈ సినిమాలో మాత్రం ఆయన సాధారణ కానిస్టేబుల్ గా కనిపించనున్నాడు.
అయితే సాధారణ కానిస్టేబుల్ పాత్ర అయినా కూడా ఇది మాంచి పవర్ఫుల్ అని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో విశాల్ చాలా ఇబ్బందులు కూడా పడ్డాడు. తాజాగా ఈ సినిమా నుంచి విశాల్ ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒళ్లంతా గాయాలైనా,లాఠీ పట్టుకుని ధైర్యంగా అక్కడే నిలబడిన విశాల ఫోజుతో పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇక ఈసినిమాకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలైట్ గా నిలువబోతున్నాయి. ఈ సినిమా షూటింగును చాలా వేగంగా పూర్తిచేసే పనుల్లో ఉన్నారట టీమ్. తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈమూవీలో విశాల్ సరసన సునైన హీరోయిన్ గ నటించింది. తెలుగు సినిమాలతోనే తన కెరియర్ ను మొదలుపెట్టి కొన్ని సినిమాలు చేసిన సునైన రాజ రాజ చోర సినిమాలో శ్రీవిష్ణు జంటగా మంచి ఇమేజ్ సాధించంది. ఇక ఇప్పుడు లాఠీ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది ఇక లాఠీ సినిమా సునైన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.